Mahesh Kumar Goud: కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేందుకు బీజేపీ, బీఆర్ ఎస్ కుట్రలు పన్నుతున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు ఏఐ టెక్నాలజీతో విష ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆర్ధిక నిర్బంధమున్న ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామన్నారు.
రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. మాటకు కట్టుబడి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు. ప్రజా పాలన ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన సాగించి మూడేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నామన్నారు.
Also read: Miss World 2025: దేశంలోనే సేఫేస్ట్ సిటీగా హైదరాబాద్..
పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు 15 నెలల కాంగ్రెస్ పాలనకు బేరీజు వేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పంచాయతీ కార్యదర్శుల సమస్య తీవ్రతను తాను అర్ధం చేసుకుంటానని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పదేళ్ల బీఆర్ ఎస్ తుగ్గక్ పాలన చేయడంతోనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.