MLC Kavitha (imagecredit:twitter)
Politics

MLC Kavitha: కవితకు పార్టీలో తగ్గుతున్న ప్రాధాన్యత.. కేసీఆర్ ఆగ్రహం

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ కవితకు చెక్ పెడుతున్నది. పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నట్లు తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థం అవుతున్నది. ఇప్పటికే కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పార్టీ కేడర్ దూరంగా ఉంటున్నది. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై సైతం గులాబీ పార్టీ సైలెంట్‌గా ఉండిపోయింది. దీనికి తోడు టీజీబీకేఎస్‌(TGBKS)కు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను కొప్పుల ఈశ్వర్‌(Koppula Ishwar)కు అప్పగించింది. దీంతో కవితను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మరోవైపు, బీసీ(BC) రిజర్వేషన్లపై గవర్నర్ ఆర్డినెన్స్‌ను పార్టీ వ్యతిరేకిస్తుండగా, కవిత సమర్థించడం కూడా దూరం పెరిగిందని స్పష్టమవుతున్నది.

సపరేటుగా వెళ్తున్న కవిత
బీఆర్ఎస్ పార్టీలో కవిత కీలక నేత. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీకి అనుబంధంగా జాగృతి సంస్థను స్థాపించి కీలక భూమిక పోషించారు. ఈ మధ్యకాలంలో జాగృతిని యాక్టీవ్ చేశారు. కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్(BRS) కార్యక్రమాలు కాకుండా జాగృతిపైనే దృష్టి సారించింది. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. దేశ విదేశాల్లో జాగృతి కమిటీలతో పాటు ఈ ఏడాది మే 27న సింగరేణి జాగృతి సంస్థ ఆవిర్భావం చేపట్టారు. 11 సింగరేణి ఏరియాలకు కోఆర్డినేటర్లను సైతం నియమించారు. టీబీజీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందని కవిత ప్రకటించారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (TGBKS)కు గౌరవ అధ్యక్షురాలిగా పనిచేస్తూ కార్మికుల సమస్యలు, సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా ఉద్యమాలు సైతం చేపట్టారు.

అయితే, ఎప్పుడైతే సింగరేణి జాగృతిని కవిత ఏర్పాటు చేయడంతో పార్టీ అలర్ట్ అయినట్లు సమాచారం. టీజీబీకేఎస్‌కు నష్టం జరుగకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇన్‌ఛార్జ్ బాధ్యతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని, ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని, సంఘం కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకుపోవాలని, సింగరేణి సమస్యలపై మరింత పెద్దఎత్తున పోరాటం చేయాలని ఈ నెల 16న తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. దీంతో కవితను సైడ్ చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది.

Also Read: YS Jagan: వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి?

ఇన్‌డైరెక్ట్ హింట్ ఇస్తున్న పార్టీ
కాళేశ్వరం(Kaleshwaram) కమిషన్ విచారణకు హాజరుకావాలని కేసీఆర్‌(KCR)కు నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తూ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని పేర్కొంటూ ఘాటుగా కవిత స్పందించి పార్టీపై, వర్కింగ్ ప్రెసిడెంట్‌పై, నేతలపైనా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎవరూ స్పందించలేదు. ప్రభుత్వంపై చేపడుతున్న నిరసన, ధర్నాలకు పార్టీ నేతలు దూరంగా ఉంటున్నారు. కేవలం జాగృతి నేతలు మాత్రమే హాజరవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేసిన వ్యాఖ్యలపైనా పార్టీ నుంచి కీలక నేతలు ఎవరు స్పందించింది లేదు. దీంతో పార్టీ స్పందించకపోవడం నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ పరిణామంతో పార్టీ కవితను దూరం పెడుతుందని చెప్పకనే చెప్పినట్లు అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పొమ్మనలేక పొగబెడుతున్నారా?
మరోవైపు, బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపడాన్ని బీఆర్ఎస్(BRS) పార్టీ వ్యతిరేకించింది. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా ఆర్డినెన్స్ తేవడం మోసం తప్ప మరొకటి కాదని మండిపడుతున్నది. అయితే, కవిత(Kavitha) మాత్రం బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని, పంచాయతీ రాజ్ చట్ట సవరణపై రాష్ట్ర క్యాబినెట్ చేసిన తీర్మానం (ఆర్డినెన్స్)ను సమర్థిస్తున్నానని, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్‌కు సపోర్ట్ చేశానని స్పష్టం చేశారు. కవిత వ్యాఖ్యలు పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

దీంతో పార్టీ అధినేత కేసీఆర్(KCR) సైతం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కవిత ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై ఆరా తీసినట్లు తెలిసింది. సొంత ఎజెండాతో పోవడంపైనా వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. కవిత అనుసరిస్తున్న పార్టీ వ్యతిరేక విధానాలు, జాగృతితో కార్యక్రమాలు చేయడంతో అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. అయితే చర్యలకు మాత్రం వెనుకాడుతున్నది. కానీ, అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అధిష్టానం తెలుసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే పార్టీ నుంచి కవిత బయటకు పంపిస్తారా, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Bhimadevarapalli: కేసులతో వేధిస్తున్నారని మహిళ ఆత్మహత్యాయత్నం

 

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?