Local body elections (imagecredit:twitter)
Politics

Local body elections: 75 కోట్లతో బ్యాలెట్ పేపర్లు ప్రింటింగ్.. ఎన్నికల కోసం సిద్ధం

Local body elections: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలోపోటీ చేసే అభ్యర్థుల కోసం బ్యాలెట్ పేపర్లను ముందుగానే ముద్రించింది. గత కొంతకాలంగా ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో 6 నెలల క్రితమే రూ.75కోట్లతో బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేసింది. అయితే ఆ బ్యాలెట్​ పేపర్లు, బ్యాలెట్​ బాక్స్​ల భద్రత అధికారులకు పరీక్షగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల బ్యాలెట్ రిమ్స్ (25 వేల పింక్, 25 వేల వైట్) ఏర్పాటు చేశారు. 48 వేల బ్యాలెట్ బాక్స్‌లను ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. ముద్రించిన బ్యాలెట్ పేపర్లు(Ballot papers) జిల్లా కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచారు.

అయితే సరైన నిల్వ, భద్రత లేకపోతే దుమ్ము,ధూళీతో పాటు చెదలు పట్టే అవకాశం లేకపోలేదు. కొన్ని జిల్లాల్లో భద్రపరిచేందుకు సరైన గోదాములు లేవనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లు చిరిగిన, వాటిపై ముద్రించిన గుర్తులు చెదిరినట్లు కనిపించినా ఉపయోగించడం సాధ్యం కాదని అధికారులే అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో మళ్లీ బ్యాలెట్ పత్రాలను ముద్రించాల్సి ఉంటుందని, దీంతో సమయం వృథా కావడంతోపాటు ప్రభుత్వానికి అదనపు ఖర్చుఅయ్యే అవకాశం ఉంది.

సర్పంచ్ ఎన్నికల కోసం
రాష్ట్రంలో 48 వేలకు పైగా పోలింగ్ బాక్స్​లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదనంగా కర్నాటక, ఏపీ నుంచి 18 వేల బాక్స్​లను అదనంగా ప్రభుత్వం తెప్పించింది. అయితే ఆరు నెలల క్రితం మైసూరు పేయింట్స్ అండ్ వార్నిషిస్ చెందిన కంపెనీ నుంచి ప్రభుత్వం బ్యాలెట్ పేపర్, ఇంకు బాటిల్స్​ఆర్డర్​ఇచ్చి రాష్ట్రానికి తెప్పించారు. ఎన్నికల్లో కీలకమైన సిరా(ఇంక్) బాటిల్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిందని అధికారులు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల కోసం1.48 లక్ష పాయిల్స్ బాటిళ్లు పరిషత్ ఎన్నికల కోసం 48 వేల పాయిల్స్ బాటిళ్లను ఎలక్షన్ కమిషన్(Election Commission) ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్లు సమాచారం. సర్పంచ్​లకు సంబంధించి 25 నుంచి 30 గుర్తులు కేటాయించగా.. అభ్యర్థులకు అల్ఫాబెటికల్​ ఆర్డర్​లో కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: GO 49: ఆదివాసీలకు అండగా 49 జీవో రద్దు.. సీఎం సంచలన నిర్ణయం

ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్
ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్నడటంతో బ్యాలెట్ పేపర్లు, బ్యాక్సులను భద్రంగా ఉంచాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పీఆర్​, ఆర్డీ డైరెక్టర్​ సృజన రాష్ట్రంలోని అన్ని జిల్లా అధికారులతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బ్యాలెట్ పేపర్లు, బాక్స్‌ల నిల్వ స్థానాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, వాటిని తడి, దుమ్ము, చెదల నుంచి కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తుండటంతో బ్యాలెట్​ పేపర్, బాక్స్​ల భద్రతపై నిఘాపెట్టాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలు సరిగ్గా లేకపోతే వెంటనే తెలియజేస్తే, వాటిని మళ్లి ముద్రించే అవకాశం ఉంటుంది.

మరి అధికారులు అప్రమత్తమై వాటిని తనిఖీ చేసి ప్రభుత్వానికి ఎన్నిరోజుల్లో రిపోర్టు అందజేస్తారనేది చూడాలి. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలు(MPTC) స్థానాలు 5,773, ఎంపీపీలు(MPP), జడ్పీటీసీ(ZPTC)ల స్థానాల సంఖ్య 566 ఉందని ప్రకటించింది. గ్రామపంచాయతీలు 12,778, గ్రామాల్లో 1,12,694 వార్డులు ఉన్నాయని పేర్కొంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు ఇప్పటికే సన్నద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే అధికారులకు ఎన్నికలపై శిక్షణ కార్యక్రమాలు సైతం చేపట్టింది. ప్రభుత్వ నోటిఫికేషనే ఇక తరువాయి.

Also Read: Kavitha Slams BJP: బీసీ రిజ‌ర్వేష‌న్లకు బీజేపీ మతం రంగు పులమడం బాధాకరం

 

 

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు