Is it easy to topple the Congress government
Politics

Political War : ఎమ్మెల్సీ ఉపఎన్నిక వార్

– స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక వార్
– కాంగ్రెస్‌లోకి వలసల జోరు
– బీఆర్ఎస్ స్థానిక లీడర్లతో చర్చలు
– సైలెంట్‌గా చక్రం తిప్పుతున్న జూపల్లి
– క్యాంపు రాజకీయాలకు తెర
– జీవన్ రెడ్డి వర్సెస్ నవీన్ రెడ్డి

MLC By Election War : తెలంగాణలో ఎన్నికల కోలాహలం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాల్లో ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హడావుడి కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరులోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు జెండా ఎగురవేసింది. అదే ఊపును పార్లమెంట్, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో చూపించాలని ప్రయత్నిస్తోంది. జీవన్ రెడ్డి గెలుపుకోసం ఉమ్మడి జిల్లా నేతలు శ్రమిస్తున్నారు.

కష్టాల్లో బీఆర్ఎస్

ఓవైపు కాంగ్రెస్ గెలుపు వ్యూహాల్లో ఉంటే, ఇంకోవైపు బీఆర్‌ఎస్‌ నేతల పార్టీ మార్పుతో జిల్లాలో కారు ఖాళీ అవుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఓటమి భయం వెంటాడుతోందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఫ్రభుత్వంలో పదవులు ఉన్నా తమను ఆటబొమ్మల్లా చూశారే తప్ప, ఎలాంటి గౌరవం ఇవ్వలేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అసహనం ఉంది. ఈసారైనా తమకు అండగా ఉండేవారిని గెలుపించుకోవాలని వారంతా ఏకతాటిపైకి వచ్చినట్టు సమాచారం.

చక్రం తిప్పుతున్న జూపల్లి

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల్లో మొత్తం 1,439 ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 850కి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్‎లోనే ఉన్నారు. కాంగ్రెస్‎కు 400 పైచిలకు ఓటర్లు ఉన్నారు. బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలుపుకొని మరో 100 మంది వరకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు. పూర్తిగా నెంబర్ మీదే ఆధారపడి ఉన్న ఎన్నిక కావడంతో కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ సీటు గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం హామీ మేరకు ప్రతి ఓటరునూ సంప్రదిస్తున్నారు. వారి సమస్యలు, అవసరాలు తెలుసుకొని పార్టీలో చేర్చుకోవడం లేదా తమకు అనుకూలంగా మార్చుకొంటూ ముందుకెళ్తడం చేస్తున్నారు.

Read More: నైట్ ఎకానమీపై సర్కారు కసరత్తు

సీఎం హామీతో స్థానిక నేతలకు భరోసా!

అసెంబ్లీ ఎన్నికల ముందు కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. మరోవైపు, రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మిగిలిన వాళ్ళలో మెజారిటీ సభ్యులు హస్తం గుర్తుకు ఓటేస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ అమలు చేస్తోంది. బీఆర్ఎస్‎లో ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను తమ వైపు ఆకర్షించేందుకు ఇప్పటికే పలు హామీలు సైతం ఇచ్చింది. పాలమూరు ప్రజా దీవెన సభ వేదికగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. గత ప్రభుత్వంలో పెండింగ్‎లో ఉన్న వివిధ అభివృద్ధి పనుల బిల్లులు సైతం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

క్యాంపు రాజకీయాలకు తెర

ఓటమి భయంతో బీఆర్‌ఎస్ పార్టీ క్యాంప్‌ రాజకీయాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనవారిని బుజ్జగించే పనిలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. అయితే, అసంతృప్తులు మాత్రం కాంగ్రెస్‌ వైపే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఓడిపోయే సీటు కాబట్టే షాద్‌ నగర్ మాజీ ఎమ్మెల్యే తన రాజకీయ వారసులను కాకుండా నవీన్‌ రెడ్డిని బరిలో నిలిపారన్న టాక్‌ నడుస్తోంది. పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్‌లో చేరికలు జోరందుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!