Local Body Elections: బీహార్ ఎన్నికల తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు పక్కగా అమలు చేస్తూనే ఎన్నికలకు వెళ్లాలని మెజార్టీ లీడర్లు తమ అభిప్రాయాలను వెల్లడించగా, ప్రభుత్వం కూడా ఆదిశగానే ఆలోచిస్తున్నది. 42 శాతం రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు వెళ్తే, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఇటీవల పీసీసీ(PCC) విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య లీడర్లంతా సీఎంకు వివరించారు. బీసీ రిజర్వేషన్లు మస్ట్ అంటూ తేల్చి చెప్పారు. దీంతో సీఎం కూడా స్టడీ చేస్తున్నారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు అమలుపై మరింత లోతుగా కసరత్తు జరుపుతున్నారు. టెక్నికల్, లీగల్ చిక్కులు లేకుండా క్లియర్ గా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.
ప్రత్యేక జీవో ను తీసుకువచ్చి, గవర్నర్ ఆమోదముద్ర వేయించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ(Delhi)లోని కీలక అడ్వకేట్ల అభిప్రాయాలను కూడా సీఎం పరిగణలోకి తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంపు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, లీగల్ సమస్యలకు పరిష్కారం వంటి వివరాలను రిపోర్టు రూపంలో తీసుకున్నారు. వీటిపై కూడా రాష్ట్ర ముఖ్య నేతలు, బీసీ లీడర్లు, మేధావులతో సీఎం చర్చించనున్నారు. ఆలస్యమైనా రిజర్వేషన్లతోనే ముందుకు సాగేందుకు ప్రయత్నించనున్నారు. ఇందుకు కోర్టు ను కూడా గడువు పెంచాలని కోరనున్నట్లు సమాచారం.
రాష్ట్రపతి, గవర్నర్ ను ఒప్పించేందుకు..
ఆర్డినెన్స్, బిల్లులకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విధించిన గడువును పొడిగించాలని ప్రభుత్వం కోరనున్నది. కోర్టు గడువు ఇస్తే, ఈ లోపు రాష్ట్రపతి(President), గవర్నర్(Governor) లను కన్విన్స్ చేయాలని ప్రభుత్వం వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నది. అంతేగాక బీహార్(Bihar) ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే, మరింత ప్లస్ పాయింట్ అవుతుందని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. కేంద్రంపై ఒత్తిడి పెంచి బిల్లులు పాస్ చేయించుకోవచ్చనే ధీమాతో రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్(BC Reservation) అమలుకు కనీసం గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చినా.. ప్రత్యేక జీవో ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతాన్ని అమలు చేస్తూ ముందుకు సాగనున్నది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు పంచాయితీ రాజ్ చట్టం సవరించాలంటే గవర్నర్ సంతకం తప్పనిసరి. ఎన్నికల ఆలస్యానికి ప్రధాన కారణం ఇదేనంటూ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: The Girlfriend: అనుకోకుండా ఇంటికి వచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌పై.. ఏం జరిగిందంటే?
ఇప్పుడు అంగీకరిస్తారా..?
గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదని సీలింగ్ విధిస్తూ పంచాయితీ రాజ్ చట్టం 2018–19లో పొందుపరిచింది. ఈ క్లాజ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి పెద్ద సమస్యగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్తున్నా..గతంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్ క్యాప్ అడ్డుకుంటున్నది. ఈ క్యాప్ తొలగించకపోతే ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంపు సాధ్యపడదు. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం పంచాయితీ రాజ్ చట్టం సవరణకు ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్ కు పంపించింది. కానీ ఆయన ఇప్పటి వరకు ఆ ఆర్డినెన్స్ కు అనుమతులు ఇవ్వలేదు. ఇక విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం అమలు చేయాలంటే రాష్ట్రపతి అనుమతి అవసరం. ఈ రెండు బిల్లులు అక్కడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరోసారి కోరినా..రాష్ట్రపతి, గవర్నర్ అనుమతి ఇస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.
Also Read: Shocking Murder: కుషాయిగూడలో దారుణం.. ఓ రియల్టర్ దారుణ హత్య!
