Telangana Governor | ప్రమాణం, కొత్త ప్రయాణం
Telangana Governor Standard New Journey
Political News

Telangana Governor : ప్రమాణం, కొత్త ప్రయాణం

  •  గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న సీపీ రాధాకృష్ణన్
  •  ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే
  • హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
  •  రాష్ట్ర పరిస్థితులపై సీఎంతో చర్చ

Standard, New Journey : తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టగానే సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

రాధాకృష్ణన్ ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై రాజీనామా చేశారు. ఈ క్రమంలో సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు. ఈయన తమిళనాడుకు చెందిన వారు. 1957 మే 4న జన్మించారు. బీజేపీలో కీలకంగా పనిచేశారు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. కోయంబత్తూరు నుంచి ఎంపీగా రెండుసార్లు విజయం సాధించారు.

Read Also: స్కీములతో మస్కా! అధిక వడ్డీ పేరుతో భారీ మోసం

పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రంలో ఆయనకు కీలక పదవి దక్కింది. 2016-19 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు ఛైర్మన్ పనిచేశారు. 2023 ఫిబ్రవరి 18న జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏడాదికిపైగా ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ బాధ్యతలను ఆయనకు రాష్ట్రపతి అప్పగించారు. అలాగే, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

తెలంగాణ, పాండిచ్చేరికి కొత్త గవర్నర్లను నియమించే వరకు సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ముగ్గురు గవర్నర్‌లు వచ్చారు.తొలి గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్, ఆ పనిచేసిన తమిళిసై, ఇప్పుడు సీపీ రాధాకృష్ణన్ ముగ్గురూ తమిళనాడుకు చెందినవారే.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?