KTR (image CREDIT: TWITTER)
Politics, తెలంగాణ

KTR: రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.. కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR: రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, ఈ బలవన్మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విమర్శించారు. రేవంత్ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ సంక్షోభం, ఎన్నికల హామీల వైఫల్యం కారణంగానే అన్నదాతలు తమ నిండు ప్రాణాలను బలి తీసుకొంటున్నారని ఆరోపించారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అసమర్థతతో తెచ్చిన సాగునీటి సంక్షోభం, పెట్టుబడి సాయం లేకపోవడం, పంట నష్టానికి పరిహారం అందకపోవడం వంటి కారణాల వల్లే అన్నదాతలు తమ నిండు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 Also Read: Khammam district: ఖమ్మం జిల్లా గంగారంతండాలో.. యువ శాస్త్రవేత్త అశ్విని గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు

ఇలా కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఈ వ్యవసాయ సంక్షోభం

ప్రభుత్వ చేతకానితనంతో సృష్టించిన సాగునీటి సంక్షోభంతో బోర్లు వేసి, తీవ్రంగా నష్టపోయిన మొగిలి లక్ష్మణ్ ప్రాణాలు తీసుకుంటే… రైతుబంధు వంటి పెట్టుబడి సాయం లేక, ఆర్థిక భారంతో అప్పుల పాలై గూగులోత్ భాస్కర్ బలయ్యారని పేర్కొన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం అందక నాలికి అనిల్ అనే యువ రైతు కుటుంబాన్ని విషాదంలో ముంచి తనువు చాలించాడని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇలా రేవంత్ సర్కార్ తెచ్చిన ఈ వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కలేక అన్నదాతలు వరుసగా తమ నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పాలన రాగానే రైతు కుటుంబాల్లో ఈ మరణమృదంగం ప్రమాదఘంటికలు మోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన స్థాయిలో మరోసారి తెలంగాణ గడ్డపై రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకోవడం విషాదమే కాదు, ముంచుకొస్తున్న విలయానికి సంకేతం అని తెలిపారు. ‘రైతన్నలారా అధైర్యపడకండి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో మళ్లీ వ్యవసాయాన్ని గాడిన పెట్టుకుందాం.. అప్పటి వరకు సంఘటితంగా పోరాడదాం.. రైతు వ్యతిరేక రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదాం’ అని ఆయన భరోసా ఇచ్చారు.

సంక్షేమ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితి

యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి, చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ విమర్శించారు. గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వ అసమర్థత, చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి, గురుకుల భవనాలకు ఏకంగా ఏడాది కాలం నుంచి అద్దె బకాయిలు చెల్లించకపోవడాన్ని తప్పుబట్టారు. ఓవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతున్న ముఖ్యమంత్రి, సంక్షేమ గురుకులాలను కూడా సమాధి చేసే పన్నాగం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

ఆ సొమ్ముతో ఎవరి జేబులు నింపుతున్నాడో తక్షణమే లెక్కలు చెప్పాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించిన రెసిడెన్షియల్ వ్యవస్థను బలిపెడితే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. రెండేళ్లు నిండకుండానే రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి, కనీసం గురుకులాల అద్దె కిరాయి కూడా కట్టకుండా, ఆ సొమ్ముతో ఎవరి జేబులు నింపుతున్నాడో తక్షణమే లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని అన్ని గురుకుల భవనాల అద్దె బకాయిలను విడుదల చేసి, విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితే వస్తే, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని తీవ్ర హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.

Also Read: Khammam: అసైన్‌డ్ ల్యాండ్స్ స్కాం.. తప్పుడు రిపోర్టుతో కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించిన రెవెన్యూ అధికారులు!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది