DCC Selections: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష (డీసీసీ) పదవుల ఎంపిక ప్రక్రియ ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా చేపడుతున్న ఈ నియామకాలపై అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, డీసీసీ(DCC) అధ్యక్షుల స్క్రీనింగ్ ప్రక్రియను ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.డీసీసీ అధ్యక్షుల ఎంపికలో భాగంగా శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్లో కీలకమైన ‘వన్-టూ-వన్’ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలోని ముఖ్య నేతల నుంచి ఏఐసీసీ(AICC) నేతలు వ్యక్తిగతంగా అభిప్రాయాలను సేకరించనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud)తో పాటు పలువురు సీనియర్ మంత్రుల నుంచి ఓపీనియన్లు తీసుకోనున్నారు. ఆయా జిల్లాల సమీకరణాలు, క్యాండియేట్ పనితీరు, అనుభవం, తదితర అంశాలపై సమగ్రంగా వివరాలను సేకరించనున్నారు.
జాబితా ఫిల్టర్ పై ఏఐసీసీ కసరత్తు..
రాష్ట్రంలో 33 జిల్లాల్లో కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించాల్సి ఉంది. ఈ పదవుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా, గతంలో ఏఐసీ(AICC)సీ నియమించిన పరిశీలకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-చార్జీలు, సీనియర్ నేతల నుంచి విస్తృతంగా అభిప్రాయ సేకరణ నిర్వహించి, జాబితాను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో, ఏఐసీసీ పరిశీలకులు సమర్పించిన జాబితాలను ఫిల్టర్ చేసేందుకే ముఖ్య నేతల నుంచి సేకరించిన అభిప్రాయాలను పోల్చి చూడనున్నారు. పార్టీ రూల్ ప్రకారం, కనీసం ఐదు సంవత్సరాలుగా పార్టీలోనే ఉండి, చురుకుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో జిల్లా నుంచి కనీసం ఆరుగురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి, అందులో నుంచి తుది అధ్యక్షుడిని ఖరారు చేయనున్నారు.
ఉత్కంఠగా మారిన ప్రాసెస్.. ఈ నెలాఖరు లోపే..?
సాధారణంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక గతంలో కేవలం పీసీసీ(PCC) పరిధిలో జరిగేది. కానీ ఈసారి ఏఐసీసీ స్థాయిలోనే సెలక్షన్లు జరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ(Telangana)లో అధికారం చేపట్టిన తర్వాత ఈ నియామకాలు జరుగుతుండటం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉండటంతో ఈ ప్రక్రియ ను ఏఐసీసీ కూడా గ్రౌండ్ లెవల్ లో చెక్ చేస్తుంది. ఏఐసీసీ ప్రత్యేక టీమ్స్ పర్యవేక్షణలో అత్యంత పకడ్బందీగా కొనసాగుతోంది. ఈ స్క్రీనింగ్ పూర్తయ్యాక, ఈ నెలాఖరు లోపే కొత్త డీసీసీ అధ్యక్షుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read: Operation Hidma: ఆపరేషన్ హిడ్మా సక్సెస్ అవుతుందా..? ఇక మావోయిస్టుల పని అయిపోయినట్లేనా..!
