KTR (imagecredit:swetcha)
Politics, తెలంగాణ

KTR: బీజేపీ తెలంగాణకు పనికిరాని పార్టీ అంటూ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఈ ఉప ఎన్నికలో ‘కారు (BRS) కావాలా, బుల్డోజర్ (Congress) కావాలా?’ అనేది నిర్ణయించుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సూచించారు. తెలంగాణ భవన్‌లో షేక్‌పేట్ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు చెర్క మహేష్‌(Cherka Mahesh)తో పాటు పలువురిని ఆదివారం పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెప్తుంటే, రాష్ట్రంలో రెండేళ్లుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.

మొత్తం అవినీతి సొమ్ము..

ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌(Congress)కు సోయి వస్తుందని హెచ్చరించారు. ‘రెండేళ్లల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్‌(Jublihills)లో కాంగ్రెస్ ఖర్చుపెడుతున్నది, ఓటుకు రూ.10వేలు ఇస్తారు. ఆరు గ్యారంటీలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఈ రెండేళ్లుగా ఒక్క మంచి పని కూడా చేయలేకపోయిన ప్రభుత్వం, ఒక్క ఇల్లు కట్టకుండా, ఒక్క ఇటుక పెట్టకుండానే రూ.2 లక్షల 30 వేల కోట్లు అప్పులు మాత్రం చేసింది. గరీబోళ్ల ఇళ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి, హైదరాబాద్‌(Hyderabada)లో పేదవాళ్ల ఇళ్లను కూలగొట్టిస్తున్నారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also Read; Peddi leaked video: మళ్లీ నెట్‌లో హల్ చల్ చేస్తున్న ‘పెద్ది’ షూటింగ్ వీడియో.. ఇదంతా నిర్మాతల పనేనా?

హామీల మోసం..

బీసీ రిజర్వేషన్లు, ముస్లింలకు స్మశానం వంటి అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మోసం చేశారని కేటీఆర్(KTR) ఆరోపించారు. పార్లమెంట్‌లో చేయాల్సిన చట్టాన్ని అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశారన్నారు. ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్(KCR) నామం జపం చేసి కాలం గడిపిందని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అని దుయ్యబట్టిన కేటీఆర్, కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అన్నారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలంటే కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాల్సిందే, అది జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు రూ.4 వేల పెన్షన్లు, చెప్పిన హామీలన్నీ అమలు అవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Ishwar), మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి(Ravula Chandrasekhar Reddy), ఎమ్మెల్యే ముఠా గోపాల్(MLA Mutha Gopal), ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Shravan) తదితరులు పాల్గొన్నారు.

Also Read; Harish Rao: దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఉంటుందా? హరీష్ రావు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది