TDP Challenges YS Jagan: మాజీ సీఎం జగన్ కు టిడిపి ఛాలెంజ్ విసిరింది. దమ్ముంటే నేరుగా తిరుమల కు రావాలని, అక్కడి గోశాలను సందర్శించాలని టిడిపి సోషల్ మీడియా పేజీ ద్వారా జగన్ కు సవాల్ విసిరారు.
ఇటీవల తిరుమల గోశాల లక్ష్యంగా టిడిపి వర్సెస్ వైసీపీ మధ్య విమర్శలు సాగుతున్న విషయం తెలిసిందే. టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తి ఘాటు విమర్శలు చేశారు. 100 వరకు గోవులు ప్రాణాలు విడిచాయని, ఈ పాపం కూటమి ప్రభుత్వాన్ని దేని అంటూ కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
ఈ ఆరోపణలపై టీటీడీతో పాటు కూటమి ప్రభుత్వం భగ్గుమంది. భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేసిన వీడియోలు పాతవిగా, అలాంటి ఘటన జరగలేదంటూ టిటిడి కొట్టి పారేసింది. అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరిగాయని, పాత వీడియోలను చూపించి గోవులు చనిపోయాయని ప్రచారం చేయడం తగదని టీటీడీ సూచించింది.
ఇదే విషయంపై టిడిపి నేతలు సైతం ఫైర్ అయ్యారు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్ సైతం జోక్యం చేసుకొని పలు విమర్శలు గుప్పించారు. గోశాల లక్ష్యంగా టిడిపి, వైసీపీ మధ్య రోజురోజుకు వివాదం చెలరేగుతుంది. వైసీపీకి చెందిన పలువురు మీడియా సమావేశాలు నిర్వహించి మరీ గోశాలలో గోవులు చనిపోతున్నాయని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ విమర్శలు గుప్పించారు. ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఖాతా ద్వారా మాజీ సీఎం జగన్ కు ఛాలెంజ్ విసిరారు.
17వ తేదీన మాజీ సీఎం జగన్, మాజీ టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డిలు ఇద్దరు తిరుమలకు రావాలని, అలాగే గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో కళ్లారా చూడాలని టిడిపి ఛాలెంజ్ విసిరింది. సమయాన్ని సైతం తెలిపిన టిడిపి, ఉదయం 10 గంటలకు ఇదే మా ఛాలెంజ్, మీరు రావాలంటూ టిడిపి ట్వీట్ చేయడం విశేషం.
Also Read: Viral Video: ఓరి.. నీ.. తెలివి తగలెయ్య.. ఇదేం టెక్నిక్ భయ్యా.. నువ్వు సూపర్..
ఈ ట్వీట్ కు వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మొత్తం మీద గోశాల నిర్వహణ ఇటీవల వార్తలో నిలవడంతో అబద్ధపు ప్రచారాలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరిస్తోంది. అంతేకాకుండా అవాస్తవాలు ప్రచారం చేశారన్న ఆరోపణతో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై ఇప్పటికే చర్యలకు టీటీడీ ఉపక్రమించింది. మొత్తం మీద గోశాల వ్యవహారం ప్రస్తుతం నిరంతరం వార్తలో నిలుస్తుందని చెప్పవచ్చు.
Countdown Begins⏱️
We challenge Mr. @ysjagan and Mr. Bhumana Karunakar Reddy to show up at Tirumala on April 17th and witness the state of the Gaushala with their own eyes.
🔴LIVE at 10:00 AMకౌంట్‌డౌన్ ప్రారంభం ⏱️
వైఎస్ జగన్‌కి, భూమన కరుణాకర్‌రెడ్డికి ఇదే మా ఛాలెంజ్. ఏప్రిల్…— Telugu Desam Party (@JaiTDP) April 16, 2025