స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్: TDP Alliance govt: సార్వత్రిక ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో వరుస ఎదురుదెబ్బలతో సతమతం అవుతున్న వైసీపీకి ఊహించని రీతిలో ఝలక్ తగలబోతోంది. ఒక్కో కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంటూ వస్తున్న కూటమి కన్ను ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ గ్రేటర్ విశాఖపై పడింది. దీన్ని కైవసం చేసుకునేందుకు కూటమి శరవేగంగా పావులు కదుపుతున్నది.
మేయర్ హరి వెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది. మరోవైపు సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల గడువు పూర్తి కావాల్సిందే. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందని జిల్లా కూటమి నేతలు జోష్‌లో ఉన్నారు. ఎందుకంటే ఆ గడువు నేటితో (మార్చి 18) ముగుస్తున్నది.
Also Read: AP Cabinet: జగన్ కు ఝలక్.. పేర్లు మార్చేసిన ప్రభుత్వం.. ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయం..
ప్లాన్ ఆఫ్ యాక్షన్..
గడువు ముగియనున్న నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయడానికి రంగం సిద్ధం చేసేశారు. వాస్తవానికి ఇప్పటికే వైసీపీ చేతిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కూటమి కైవసం చేసుకుంటూ వస్తున్నది. ఇప్పుడిక విశాఖ వంతు వచ్చేసింది. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కావాల్సినవన్నీ ఇప్పటికే సీనియర్ సభ్యులు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు టాస్క్ పూర్తి చేసినట్లుగా సమాచారం.
Also Read: Tirumala Crime: టీటీడీ పేరుతో ఘరానా మోసం.. అవాక్కైన పోలీసులు..
వైసీపీ కార్పొరేటర్లను కావాల్సినంత మందిని టీడీపీ వైపు తిప్పుకున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మేయర్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోని నిలబడతారా? లేదంటే ముందుగానే రాజీనామా చేసి వైదొలుగుతారా? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ మధ్యనే ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి గట్టి ఝలక్ తగిలింది. ఇప్పుడు మేయర్ విషయంలో అంతకుమించి ఇవ్వాలని కూటమి వ్యూహాలకు వైసీపీ కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రతివ్యూహాలను గట్టిగానే అమలు చేస్తోంది.