Telangana Politics (imagecredit:swetcha)
Politics

Telangana Politics: ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు.. స్పీకర్ 5 గురికి నోటీసులు?

Telangana Politics: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో ఏం చేయాలని మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామా? లేదా? సందిగ్ధంలో పడ్డారు. దానిని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి సమాధానంను స్పీకర్ కు ఇవ్వాలి అనేదానిపై కసరత్తు చేస్తున్నారు. తొలివిడుతగా 5గురికి స్పీకర్ నోటీసులు ఇవ్వగా, మరో 5గురికి త్వరలోనే ఇవ్వబోతున్నట్లు సమాచారం. నాలుగు వారాల్లో ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.

న్యాయ నిపుణుల సలహా మేరకు

బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్(Congress) లో చేరారు. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్(BRS) పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. మూడు నెలల్లోగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న కోర్టు ఆదేశాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) జారీ చేసింది. దీంతో న్యాయ నిపుణుల సలహా మేరకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణా మోహనరెడ్డి ఉన్నారు. ఇందులో కడియం శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి , యాదయ్య , ప్రకాష్ గౌడ్ , పోచారం శ్రీనివాస్ రెడ్డి లకు నోటీసులు పంపినట్లు సమాచారం. మిగిలిన 5 మందికి త్వరలో పంపనున్నట్లు తెలిసింది. స్పీకర్ నోటీసుల్లో 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ఏం సమాధానం ఇస్తారు.. వారిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నిర్ణయం తీసుకుంటారా? పెండింగ్ లో పెడతారా? అనేది కూడా చర్చకు దారితీసింది.

Also Read: Secunderabad Patny: గుడిలో అమ్మవారి విగ్రహం మాయం?.. ఎక్కడంటే!

మిగిలిన ఎమ్మెల్యేలు సైతం

అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీపాంపై ఎంపీ(MP)గా పోటీ చేశారు. అంతేకాదు ప్రచారం చేశారు. కడియం శ్రీహరి(Kadiyam Srihari) సైతం కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేయడంతో పాటు ఆయన కూతురు కావ్యను కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయించారు. ఎంపీగా గెలిపించారు. తెల్లం వెంకట్రావ్ సైతం కాంగ్రెస్(Congress) సమావేశాల్లో పాల్గొనడం, సభా వేదికపై నేతలతో కలిసి కూర్చొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం కోర్టుకు బీఆర్ఎస్(BRS) సమర్పించింది. మిగిలిన ఎమ్మెల్యేలు సైతం పార్టీ కండువాలు కొప్పుకోవడం, కొంతమంది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న పొటోలతో కోర్టుకు అందజేసింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయంను స్పీకర్ తీసుకుంటారు. అధికారపార్టీలో ఎమ్మెల్యేలు చేరడంతో ఎలా ముందుకు పోతారనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్(MLA Prakash Goud) విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 27 తర్వాత హైదరాబాద్ కు రానున్నట్లు సమాచారం.

వేటు వేయాల్సిందేనని డిమాండ్

పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది మాత్రం తాము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతున్న వారు మాత్రం తమవాదనను మరోలా వినిపిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, అందుకు సంబంధించిన ఆధారాలను సైతం స్పీకర్ కు, కోర్టులకు అందజేశామని వారిపై వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. సుప్రీం కోర్టు సైతం ఇచ్చిన మూడు నెలల గడువులో ఇప్పటికే ఒక నెల కంప్లీట్ అయింది. ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది. ఈ సమయంలోస్పీకర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

ఒకవైళ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేస్తే.. ఉప ఎన్నికల్లో గెలుస్తారా? లేదా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ ఎమ్మెల్యేలు సైతం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కోవాలి? గెలుస్తామా? లేదా? ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి..అనేది కూడా నియోజకవర్గాల్లో విస్తృతంగా చర్చజరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు హింట్ ఇచ్చింది. కేడర్ ను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ తరుణంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.. ఎలా ముందుకు వెళ్తారనేది చూడాలి.

Also Read: Begari Vishnu:పేదరికాన్ని జయించి.. పీహెచ్‌డీ పట్టా

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?