Shilpa Reddy: రాష్ట్రంలోని కోటి మందికి చీరలు ఇస్తేనే మహిళల ఉన్నతి జరిగినట్టా? అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి (Shilpa Reddy) ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల జన్మదినం సందర్భంగా జపమాల వేసుకోవాలని, అంతేకానీ మహిళలను సారె పేరుతో అవమానపరచొద్దని మండిపడ్డారు. అసలు ఈ ప్రభుత్వానికి సారె అంటే అర్థం తెలుసా? అని శిల్పారెడ్డి ప్రశ్నించారు.
Also Read: Telangana BJP: జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ఫలితాలలో కాషాయ పార్టీ ఘోర పరాజయం.. ఓటమి బాధ్యత ఎవరిది?
మతలబేంటి?
ఉన్నఫళంగా మహిళలకు సారె అందించడం వెనక ఉన్న మతలబేంటి? అని నిలదీశారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, వాటిని విస్మరించి చీరలు పంచుతారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళల ఓట్లు దక్కించుకునేందుకే ప్రభుత్వం కొత్త గేమ్‌ను తెరమీదకు తెచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు కేంద్ర ప్రభుత్వం అనేక రుణాలు, రాయితీలు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని శిల్పారెడ్డి విమర్శలు చేశారు.
Also Read:Telangana BJP: గతంలో రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. ఈసారీ వర్కౌట్ అయ్యేనా..?

