Sabitha Indra Reddy: దివ్యాంగుల సంక్షేమ బోర్డు ఊసే లేదు
Sabitha Indra Reddy ( image credit: swetcha report)
Political News

Sabitha Indra Reddy: దివ్యాంగుల సంక్షేమ బోర్డు ఊసే లేదు: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపాటు

Sabitha Indra Reddy: దివ్యాంగుల రిజర్వేషన్లు 4 శాతానికి పెంచుతామని అమలు చేయలేదు.. వికలాంగుల సంక్షేమ బోర్డు ఊసే లేదు అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) మండిపడ్డారు. దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇప్పటివరకు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో  నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఓ కుటుంబ పెద్ద లాగా తెలంగాణ లో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) రెండున్నరలక్షల కోట్లు అప్పులు తెచ్చి చేసింది ఏమీ లేదని నిలదీశారు. దివ్యాంగుల పెన్షన్ ను 6 వేల కు పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు.

Also Read: Sabitha Indra Reddy: దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి.. మాజీ మంత్రి ఛాలెంజ్!

4 లక్షల 90 వేల మందికి మాత్రమే వస్తోంది

కేసీఆర్ ఇచ్చిన నాలుగు వేల పెన్షన్ల యే అమలవుతోందన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీల అమలుకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కె .వాసుదేవ రెడ్డిమాట్లాడుతూ కేసీఆర్ పాలనలో 5 లక్షల 15 వేల మంది దివ్యాంగులకు నెలకు 4 వేల పెన్షన్ వచ్చేదని, ఇపుడు కేవలం 4 లక్షల 90 వేల మందికి మాత్రమే వస్తోందని 25 వేల మందికి పెన్షన్లలో కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ నేతలు కె .కిషోర్ గౌడ్ ,మన్నె గోవర్ధన్ రెడ్డి ,అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ,ఆజం అలీ పాల్గొన్నారు.

Also Read: Telangana Assembly: అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ.. ఆ నలుగురు ఎమ్మెల్యేల నుంచి వివరణ

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?