Sabitha Indra Reddy(image credit:X)
Politics

Sabitha Indra Reddy: దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి.. మాజీ మంత్రి ఛాలెంజ్!

Sabitha Indra Reddy: ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్‌ బాడీ ఎన్నికలు జరిపించాలని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపాలిటీ పహాడిషరీఫ్‏లోని ప్రీమియర్‌ ఫంక్షన్‌ హాల్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను 380 మందికి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Also read: Miss World Contestants: కట్టు బొట్టుతో ఆకట్టుకున్న అందాల భామలు

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఇవాళ ఆ హామీలను పూర్తిగా విస్మరించి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు.

ఇప్పటికీ ప్రజల్లో వెళ్లే ధైర్యంలేక లోకల్‌ బాడీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తోందన్నారు. దమ్ముంటే వెంటనే ఎన్నికలు పెట్టాలని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!