Raja Singh: నేను బీజేపీలో చేరను.. పార్టీని సర్వనాశనం చేస్తున్నారు
Raja Singh (imagecredit:swetcha)
Political News, Telangana News

Raja Singh: నేను బీజేపీలో చేరను.. పార్టీని సర్వనాశనం చేస్తున్నారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!

Raja Singh: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం రాజాసింగ్(Raja Singh) తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ(BJP) తనను బహిష్కరించగా తిరిగి చేరుదామనుకున్నానని, కానీ ఈ ఫలితాలు చూసి ఇప్పుడు పార్టీలోకి ఎలా రావాలని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోకి చేరబోనని శుక్రవారం ఒక వీడియో(Video) రిలీజ్ చేశారు. తాను బీజేపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, అలాంటిది పార్టీకి రాజీనామా చేయాలంటే ఎంతో బాధగా ఉంటుందని వివరించారు. కానీ కొందరు పార్టీని ముంచేస్తున్నారని, మునిగిపోవడాన్ని చూడలేక బయటకు వచ్చేసినట్లు చెప్పారు.

దీని బాధ్యత ఎవరిది

వచ్చే ఎన్నికల్లో అయినా ఇలాంటి ఫలితాలు పునారావృతం అవ్వకుండా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయో లక్ష్మణ్(Laxman), కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi sanjay) తెలుసుకోవాలని సూచించారు. మీటింగ్ పెట్టుకుని సమీక్ష చేసుకుని చాయ్ తాగి వెళ్లిపోతారని రాజాసింగ్ ఎద్దేవాచేశారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీలోని సీనియర్ నేతలు ఎక్కడికి వెళ్లాలని, దీని బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. తాను మంచి చెప్పిన తననే ప్రశ్నిస్తున్నారని వాపోయారు. బీజేపీ నుంచి బయటకు వచ్చినా.. బీజేపీని తన పార్టీగ చెబుతున్నానన్నారు. అలాంటి తన పార్టీని కొందరు సర్వనాశనం చేయాలని నిర్ణయించారన్నారు. ప్రతీ ఎమ్మెల్యే(MLA), ఎంపీలు(MP) ఫ్రీడమ్ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, తెలంగాణ బీజేపీ పెద్ద మనుషులు అయినా మారడంలేదని విమర్శించారు.

Also Read: Revolver Rita Trailer: అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ.. బూతులు మాట్లాడుతున్నాడే!

ఎంపీ ఎందుకు పనిచేయలేద

కాంగ్రెస్ నేతలను చూసి అయినా బీజేపీ నేతలు నేర్చుకోవాలంటూ తనదైన శైలిలో రాజాసింగ్ చురకలంటించారు. కాంగ్రెస్ నాయకులు గెలుపు టార్గెట్ గా పెట్టుకున్నారని, బీజేపీ వాళ్లు మాత్రం ఎన్ని ఓట్లతో ఓడిపోవాలని టార్గెట్ పెట్టుకున్నారని ఘాటుగా స్పందించారు. బై ఎలక్షన్ వస్తుందని తెలిసి కూడా లోకల్ ఎంపీ ఎందుకు పనిచేయలేదని ప్రశ్నించారు. ఈవిధంగానే వెళ్తే వచ్చే 50 ఏళ్లలో కూడా బీజేపీ(BJP) తెలంగాణ(Telangana)లో అధికారంలోకి రాదని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. తాను తప్పు చేస్తే చెప్పాలని రాజాసింగ్ సూచించారు. కిషన్ రెడ్డి పార్టీని కాపాడాలని.. ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల ఓటమి కోసం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారని, అదే తరహాలో జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ కూడా అన్ని ప్రయత్నాలు చేశారన్నారు.

Also Read: Kishan Reddy: కాంగ్రెస్ అందుకే గెలిచింది.. జూబ్లీహిల్స్ ఫలితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Just In

01

Alleti Maheshwar Reddy: టూ వీలర్ పై పన్నులు పెంచడం దుర్మార్గం.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి!

Seethakka: ఉపాధి హామీపై కేంద్రం పెత్తనం ఏంటి? మంత్రి సీతక్క ఫైర్!

Bhatti Vikramarka: బీజేపీలోని ఏ ఒక్క‌నాయ‌కుడైనా దేశం కోసం త్యాగం చేశారా? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Sridhar Babu: మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి!

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?