KTR: రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, పోలీసు అధికారులకు ఒక్కటే చెబుతున్నా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఖైరతాబాద్(Khairathabad)లో మొన్న రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ కలిసి చిలుక పలుకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెసోళ్లు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. ఎక్కువ సమయం లేదు. మరో రెండున్నరేండ్లలో మళ్లీ మేమే వస్తాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో. రేవంత్ రెడ్డి(Reanth Reddy) కంటే ఎక్స్‌ట్రాలు చేసే వారందరి పేర్లు బరాబర్ రాసి పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. అన్ని లెక్కలు సెటిల్ చేసే బాధ్యత నాది, అని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హెచ్చరించారు.
బీసీ(BC) రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్(Congress) పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. 42% రిజర్వేషన్లు ఇచ్చి, వాటికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధానమంత్రి అయిన తర్వాతే ఇస్తామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెబుతున్నారని ఆరోపించారు. బీసీ డిక్లరేషన్‌లో ఈ షరతు ఉందా అని ప్రశ్నించారు. ‘గతంలో కేసీఆర్(KCR) ఢిల్లీకి వెళ్లి తెలంగాణ(Telanagna) ఏర్పాటుతోనే తిరిగి వస్తానని ప్రకటించి రాష్ట్రాన్ని సాధించిండు. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి బీసీల రిజర్వేషన్లు సాధించిండా లేదా అనేది చెప్పాలి’ అని సవాల్ చేశారు.
నన్ను మాటలు అంటున్నాడు
ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్(KCR) గురించే మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ పేరు తీయకుండా ఉండలేని మానసిక రుగ్మత రేవంత్ రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తుందని, రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది’ అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్, బీసీ డిక్లరేషన్‌లోని ఇతర హామీలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది అంతా డ్రామా అని తీవ్రంగా ఆరోపించారు. బీసీలను మోసం చేస్తున్నావు. డ్రామా చేస్తున్నావు అని అంటే. రేవంత్ రెడ్డి నన్ను మాటలు అంటున్నాడని మండిపడ్డారు. మోడీతోనూ, రాహుల్ గాంధీతోనూ రేవంత్ రెడ్డి చేస్తున్నది డ్రామా అన్నారు.
చంద్రబాబు(Chendrababu) కోసం తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెడుతూ ఆయన చేస్తున్నది డ్రామానేనని, అలాగే ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలు గురించి అడిగితే స్పందించడం లేదని, చివరికి కాంగ్రెస్(Cogress) పార్టీలో చివరిదాకా ఉంటానని రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు కూడా డ్రామానే అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తూ ఇతరులను విమర్శిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారన్నారు. కండువాలు కప్పుకొని ఇప్పుడు దేవుడి కండువాలు కప్పుకునమ్మని. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారని, కానీ శాసనసభ స్పీకర్ కి మాత్రం ఇంకా తెలియడం లేదని విమర్శించారు.
Also Read: MP Raghunandan rao: రాజకీయాల కోసం గుడులను వాడుకుంటే ప్రజా ఆగ్రహం తప్పదు
అభివృద్ధిపై మాత్రమే దృష్టి
స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections) వస్తున్నాయని, కాంగ్రెస్ నాయకులు గత 20 నెలలుగా సంపాదించిన ‘అడ్డగోలు అవినీతి పైసలను’ ప్రజలకు భారీగా పంచబోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్(Congrees) పార్టీ అరాచకాలు తగ్గాలంటే, అధికారులు ప్రజల మాట వినాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీని గెలిపించాలనిప్రజలకు పిలుపునిచ్చారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధిపై మాత్రమే దృష్టి సారించామని, పార్టీ కార్యకర్తలకు తగినంత చేయలేకపోయామని అంగీకరించారు.
మళ్లీ అధికారంలోకి రాగానే కార్యకర్తలను అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్(BRS) పార్టీ సీనియర్ నాయకుల నుంచి మొదలుకొని ప్రతి కార్యకర్త వరకు తమ తమ పరిధిలో ఉన్న గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కష్టపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) పార్టీలను మట్టికరిపించి మళ్లీ కేసీఆర్(KCR)ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం అనిపేర్కొన్నారు.
Also Read: Rakhi Gift for PM Modi: ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్ మహిళ.. అది కూడా ‘ఓం’ చిహ్నంతో..!