raghurama RRR
Politics

AP News: రఘురామ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

Raghurama: రఘురామక్రిష్ణ రాజు ఎన్నికలు జరగకముందే దాదాపు గెలిచేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచేశారు. ముందుగానే ఆయన వెల్లడించినట్టుగా కూటమి నుంచి టికెట్ సంపాదించుకున్నట్టు తెలుస్తున్నది. ఇది ఆయన విజయానికి తొలిమెట్టుగా చర్చిస్తున్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో రఘురామ టీడీపీలో చేరుతున్నారు. త్వరలోనే రఘురామకు టికెట్ కన్ఫామ్ కానుంది. తద్వార రఘురామ వర్గం గర్వంగా తలపైకెత్తుకునేలా.. ఆయన ప్రత్యర్థి వర్గాన్ని మళ్లీ సవాల్ చేసేలా పరిస్థితులను మార్చుకున్నారు. అందుకే రఘురామను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ టికెట్ పై గెలిచిన ఆయన ఆ తర్వాత సొంత పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. జగన్‌ను ఎవరూ సాహసించని రీతిలో రఘురామ విమర్శలు చేశారు. ప్రతిపక్షానికి చేరువయ్యారు. ఎన్నికలు సమీపించాక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన కూటమి నుంచి పోటీ చేస్తానని తాడేపల్లిగూడెం సభలో వెల్లడించారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు హామీ ఇచ్చారు. సీట్ల సర్దుబాటులో నర్సాపురం సీటు ఏ పార్టీకి వెళ్లినా ఆ టికెట్ రఘురామకే ఇవ్వాలని చంద్రబాబు మిగిలిన రెండు పార్టీలతో చర్చించారు.

Also Read: ఎన్నికల బరిలో రఘురామ! చక్రం తిప్పింది జగనా? చంద్రబాబా?

కానీ, బీజేపీ ఆ స్థానానికి శ్రీనివాస్ వర్మ అనే నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించింది. రఘురామ ఖంగుతిన్నారు. తనకు టికెట్ రాకుండా జగన్ కుట్ర చేశారని, ఇది తనకు తాత్కాలిక ఎదురుదెబ్బేనని బాధపడ్డారు. రఘురామ మద్దతుదారులు సోషల్ మీడియాలో కూటమిని తప్పుబట్టారు. చంద్రబాబుపైనా వ్యాఖ్యలు చేశారు. కూటమి పటుత్వాన్ని కూడా ప్రశ్నించారు.

రఘురామ కోసం చంద్రబాబు ప్రయత్నాలు ఆపలేదు. చివరకు తన పార్టీ నుంచే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామను బరిలో దింపే చాన్స్ ఉన్నదని తెలుస్తున్నది. లేదంటే ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఆఫర్ చేసి నర్సాపురం సీటును పొందడానికి డీల్ కోసం ప్రయత్నిస్తున్నట్టూ సమాచారం వస్తున్నది.

Also Read: టీడీపీకి పవన్ వరం.. బీజేపీ శాపం.. బాబు ఫ్యూచర్ ఏంటో?

రఘురామకు టికెట్ ఇచ్చి ఒక గెలుపు గుర్రాన్ని చంద్రబాబు దగ్గరపెట్టుకున్నట్టయింది. అలాగే.. కూటమి బలోపేతానికి కూడా ఈ నిర్ణయం అనివార్యమైంది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. వైఎస్ జగన్‌కు, రఘురామకు మధ్య వైరం పతాకస్థాయిలో ఉన్న సంగతి తెలిసందే. ఇద్దరు ఎదురుబడలేనంత గ్యాప్ ఉన్నది. అలాంటిది ఒకవేళ రఘురామ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిస్తే.. మొత్తంగా కూటమి అధికారంలోకి వస్తే.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రఘురామను అసెంబ్లీ స్పీకర్‌గా నియమిస్తే.. జగన్ కూడా రఘురామను అధ్యక్షా అని పిలవాల్సి వస్తుంది. రఘురామతో గౌరవపూర్వకంగా నడుచుకోవాల్సి ఉంటుందని చర్చిస్తున్నారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు