Kavitha vs KTR( image credit: twitter)
Politics

KTR vs Kavitha: కేటీఆర్ వర్సెస్ కవిత.. పార్టీ ఒకటే దారులు మాత్రం వేరే

KTR vs Kavitha: బీఆర్ఎస్ పార్టీలో (BRS PARTY)  ఆధిపత్య పోరు కొనసాగుతున్నదనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కవిత (Kavitha) కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు. తర్వాత యాక్టివ్ అయిన ఆమె, జాగృతిని యాక్టివ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించారు. పార్టీలో పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇన్ డైరెక్ట్‌గా (KTR)  కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, తన లేఖను సమర్ధించుకుంటూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కేటీఆర్‌తో ఆధిపత్య పోరు కొనసాతున్నదని, దాని చుట్టూ రకరకాల ప్రచారాలు జరిగాయి.

 Also Read: Big Folk Night 2025: జనజీవన గీతం జానపదం.. ఆగస్ట్‌లో స్వేచ్ఛ – బిగ్ టీవీ మెగా ఈవెంట్

కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో గందరగోళం

కవత (Kavitha) వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్‌లో ఒకటే కన్ఫ్యూజన్ నెలకొన్నది. ఓవైపు కేసీఆర్ (KCR)  ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తరచూ వైద్య పరీక్షలు అంటూ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇంకోవైపు, పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరుతో క్యాడర్‌లో ఒకటే కన్ఫ్యూజన్. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. పార్టీ అన్నాక ఇలాంటివి సహజం అంటూ నేతలు చెబుతున్నా, గందరగోళ పరిస్థితి మాత్రం చక్కబడడం లేదు. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న ఈ సమయంలో ఇది మరింత సమస్యగా మారుతుందన్న చర్చ జరుగుతున్నది.

బీసీ అంశంలో కేటీఆర్, కవిత చెరోదారి

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ (Congress)   కామారెడ్డిలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్‌న ప్రకటించింది. జనాభ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది. స్థానిక సంస్థల్లో బీసీకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం కోటా అమలు దిశగా ముందడుగు వేసింది. స్థానిక ఎన్నికల్లో 42 శాత రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, 2018 నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది. అయితే, ఇది ముమ్మాటికీ జాగృతి విజయం అంటూ ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) సంబురాలు చేసుకున్నారు. రైల్ రోకో నిర్వహిస్తామని తాము ప్రకటించడంతో దిగివచ్చిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరించిందని అన్నారు.

అయితే, కవిత (Kavitha) మాట్లాడి 24 గంటలు గడుకముందే, బీఆర్ఎస్ బసీ నేతలు కేటీఆర్ (KTR) ఆదేశాలతో మీడియా ముందుకొచ్చారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆర్డినెన్స్ పేరుతో మంత్రి వర్గం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కేటీఆర్‌తో మాట్లాడి తమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఓవైపు కవిత ఆధ్వర్యంలోని జాగృతి సంబురాలు చేసుకుంటుంటే, ఇంకోవైపు బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు చెబుతుండడంతో మళ్లీ అన్నా చెల్లి వార్ మొదలైందన్న చర్చ జరుగుతున్నది. ఇద్దరూ చెరో దారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెగ మాట్లాడుకుంటున్నారు.

 Also Read: Chandana Lake: చెరువులోకి ప్రమాదకర వ్యర్థాలు.. పట్టించుకోని అధికారులు

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?