Pollution free with free bus scheme
Politics

Telangana Free Bus Scheme : ఎలక్ట్రిక్ బస్సులతో పొల్యూషన్ ఫ్రీ

Telangana Free Bus Scheme : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్ స్కీమ్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతోంది. ఛార్జీల డబ్బులు ఆదా అవుతున్నాయి. ఈ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ అమాంతం పెరిగింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం 22 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జెండా ఊపి ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించారు.

ఆగస్టు నాటికి అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న 500 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులే. పాత మెట్రో ఎక్స్ ప్రెస్‌ల స్థానంలో ఈ బస్సుల్ని తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహిళలు ఈ బస్సుల్లో కూడా ఆధార్ కార్డును చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకూ కొత్తగా వచ్చే బస్సులు నడవనున్నాయి. బీహెచ్ఈఎల్, మియాపూర్, కంటెన్మెంట్, హెచ్ సీయూ, రాణిగంజ్ డిపోలలో 33 కేవీ పవర్ లైన్లు తీసుకున్నారు. మరోవైపు టీఎస్ ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్ బస్సుల్ని సమకూర్చుకుంటోంది. వీటిలో 125 మెట్రో డీలక్స్‌లు ఉంటాయి. ఇవన్నీ జూన్ నెలలో అందుబాటులోకి వస్తాయి. 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్ ప్రెస్‌లు ఉండగా 140 ఆర్డినరీ బస్సులున్నాయి.

Read More: గులాబీ పార్టీ అత్యుత్సాహం

హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మహాలక్ష్మి స్కీమ్ కింద నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు ఒక కార్మికుడిలా కృషి చేస్తున్నారని కొనియాడారు. టీఎస్ ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా కల్పిస్తున్న బస్సు ప్రయాణ ఖర్చును ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తోందని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం పదేళ్లలో చేయనిది కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లో అమలు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, ఆర్టీసీ చాలా ఆరోగ్యంగా ఉందన్నారు. దానికి కారణం ప్రభుత్వ నిర్ణయాలేనని తెలిపారు. ఉద్యోగులు ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించినందుకు ధన్యవాదాలు చెప్పారు. కాలుష్య రహిత బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుండడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సుల్ని ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?