Meenakshi Natarajan: ఐదేళ్లు పార్టీలో క్రమ శిక్షణతో, ఎలాంటి విభేదాలు లేకుండా పని చేసిన వారినే డీసీసీ(DCC) అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్(AICC in-charge Meenakshi Natarajan) పేర్కొన్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో ఆమె మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)తో కలిసి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగ డీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్ కేసీ వేణుగోపాల్(KC Venuopal) ఆదేశాల మేరకు సూచనలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉన్నదన్నారు.
రెండో సారి ఎట్టి పరిస్థితుల్లో..
డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తులు చేసుకునే వారు కనీసం 5 ఏళ్ల పాటు నిరంతరంగా పార్టీలో క్రమశిక్షణతో పని చేసి ఉండాల్సిందేనని నొక్కి చెప్పారు. అలా లేని వారిని ఏఐసీసీ(AICC) పరిశీలకులే తొలగిస్తారన్నారు. ఇప్పుడు పని చేసిన డీసీసీ అధ్యక్షులకు రెండో సారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదన్నారు. పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా అవకాశాలు లేవని స్పష్టం చేశారు ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఏఐసీసీ పరిశీలకులతో ఏ నాయకులు వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు.
Also Read: BJP Telangana: బీజేపీ జిల్లా అధ్యక్షులతో నిత్యం ఫిర్యాదులు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమలం ..!
వంద మంది సంతకాలు..
జిల్లాలోని సమావేశాలు అక్కడి నాయకుల ఇళ్లల్లో కానీ, సొంత కార్యాలయాల్లో నిర్వహించవద్దని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయం, లేదా అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, ఏఐసీసీ(AICC) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్ చోరీ కార్యక్రమంలో గ్రామంలో కనీసం వంద మంది సంతకాలు చేయించి పంపించాలని మీనాక్షి సూచించారు.
Also Read: Tollywood: బాలీవుడ్‌లా మారుతున్న టాలీవుడ్.. కంట్రోల్ తప్పుతున్నట్లేనా?
