Tollywood: ఒకప్పుడు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో (Indian Cinema Industry) అగ్రస్థానం బాలీవుడ్‌దే. అయితే, గత కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేకపోవడం, స్టార్ హీరోలు సైతం సౌత్ దర్శకుల వైపు మొగ్గు చూపడం, ముఖ్యంగా పరిశ్రమలో పెద్దరికం (Leadership) లోటు వంటి కారణాల వల్ల బాలీవుడ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. డ్రగ్స్ వ్యవహారాలు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి విషాద సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇండస్ట్రీ తరపున ఏ ఒక్క పెద్ద దిక్కు బాధ్యత తీసుకుని సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాలేదు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వంటి సీనియర్ స్టార్స్ ఉన్నప్పటికీ, వారు తమ పని తాము చూసుకోవడానికే పరిమితం కావడం బాలీవుడ్‌కు పెద్ద లోపంగా మారింది. ఇప్పుడు, అదే రకమైన పరిస్థితులు టాలీవుడ్‌లో కూడా కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read- Fauji Movie: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డ్యూడ్ హీరో సర్‌ప్రైజ్.. మొత్తానికి లీక్ చేసేశాడు
చిరంజీవి ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలని..
ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ జాతీయ స్థాయిలో విజయాలు సాధించి, గ్లోబల్ రేంజ్‌కి చేరుకున్న ప్రస్తుత తరుణంలో, ఇండస్ట్రీ పెద్దరికంపై తలెత్తుతున్న విభేదాలు పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దరికంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పలు ప్రభుత్వ వ్యవహారాలు, అంతర్గత సమస్యలను చక్కబెడుతున్నారు. అయితే, ఈ పెద్దరికాన్ని సీనియర్ నటులైన బాలకృష్ణ (Balakrishna), మోహన్ బాబు (Mohan Babu) వంటి కొందరు తక్కువ చేసి చూస్తున్నారు. బహిరంగ వేదికలపైనా, సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి ఇమేజ్‌ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం, ఇండస్ట్రీలో పెద్దగా తమకే గుర్తింపు కావాలని కోరుకోవడం తప్పితే, ఏ ఒక్క సమస్యలోనూ వారు చొరవ తీసుకుని చిరంజీవికి తోడుగా నిలబడటం లేదు.
వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి
పెద్దరికంపై ఇటువంటి అంతర్గత పోరాటం ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ఏదైనా పెద్ద వివాదం లేదా సంక్షోభం (ఉదాహరణకు టికెట్ల ధరలు, థియేటర్ల సమస్యలు లేదా అంతర్గత ఇష్యూలు) వచ్చినప్పుడు చిరంజీవి కూడా నిరాశ చెంది, బాలీవుడ్‌లోని సీనియర్ స్టార్స్ మాదిరిగా బాధ్యత నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అదే జరిగితే, నాయకత్వం లేని టాలీవుడ్ కూడా మరో బాలీవుడ్‌లా మారుతుంది. టాలీవుడ్ ప్రపంచ సినిమా వేదికపై దూసుకుపోతున్న ఈ సమయంలో, చిన్న చిన్న వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి, అంతా ఒక తాటి మీదకు రావాల్సిన అవసరం ఉంది. కేవలం పెద్దరికం మాకే కావాలి అని వాదించుకోవడం కంటే, పరిశ్రమను ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలి, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎలా పుష్ చేయాలనే దానిపై దృష్టి పెడితేనే టాలీవుడ్ యొక్క ఈ ‘గోల్డెన్ పీరియడ్’ నిలబడుతుంది. లేదంటే, బాలీవుడ్ ఎదుర్కొన్న దుస్థితి టాలీవుడ్‌కు కూడా తప్పకపోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
