Mahesh Kumar Goud: అతి త్వరలోనే నామినేటెడ్ పదవులు కేటాయించనున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు, ప్రచార కమిటీలు వస్తాయన్నారు. ఈ నెలాఖరుకు కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డు పదవులు వస్తాయన్నారు. ఆయన గాంధీభవన్ లో చిట్ చాట్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున సక్సెస్ అయిందన్నారు. పెట్టుబడులు వెల్లువెత్తాయన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఆర్ధిక విద్వాంసం చేసిందన్నారు.
Also Read: Mahesh Kumar Goud: స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి లీడర్లు దొరకడం లేదు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్!
హరీష్ రావు ఓర్వలేక విమర్శలు
కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలోనే బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధి చేసిందన్నారు. అందుకే హరీష్ రావు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలు ఎవరూ తీయలేరన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కనీసం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యే క గేయాన్ని గుర్తించలేకపోయారన్నారు. సోనియా గాంధీ నిజమైన తెలంగాణ తల్లి అన్నారు. సీఎంకు, తనకు గ్యాప్ ఉన్నదని బీఆర్ ఎస్ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీఠ వేసిందన్నారు.
Also Read: Mahesh Kumar Goud: పంచాయతీ ఎన్నికల్లో సేమ్ ఇదే జరుగుతుంది: మహేష్ కుమార్ గౌడ్

