navarang congress party
Politics

Janasena: అసలుకే ఎసరు.. జనసేన లక్ష్యంగా కొత్త పార్టీ

Navarang Party: జనసేన పార్టీకి కొత్త సమస్య ఎదురవుతున్నది. టీడీపీని, బీజేపీని కలిపే క్రమంలో సీట్లనూ త్యాగం చేసిన ఆ పార్టీ మరో తీవ్రమైన సమస్యను ఎదుర్కోబోతున్నది. అసలు ఎసరు తీసుకొచ్చేలా జనసేన, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఓ పార్టీ పుట్టుకొచ్చింది. జనసేన అంతమే తమ ఏకైక లక్ష్యం అన్నట్టుగా ఎన్నికల గుర్తు మొదలు అభ్యర్థుల పేర్ల ఎంపిక వరకు పక్కా స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది.

జనసేన టార్గెట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ దేశం మొత్తం గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బక్కెట్ గుర్తుపై బరిలోకి దిగుతున్నది. ఈ కొత్త పార్టీ ఏపీలో అన్ని చోట్ల పోటీ చేయడం లేదు. కేవలం జనసేన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నదో అక్కడి నుంచే బరిలో నిలుస్తున్నది. అది కూడా జనసేన అభ్యర్థుల పేర్లున్నవారనే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులుగా పోటీకి దింపనుంది.

Also Read: టార్గెట్ భువనగిరి.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో నవరంగ్ పార్టీ పోటీ చేయనున్నట్టు తెలిసింది. పిఠాపురం స్థానం నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న నాయకుడినే తమ అభ్యర్థిగా బరిలోకి దించనుంది. ఇదే విధంగా మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి, తెనాలి నుంచి మనోహర్‌ల పేరుతో తమ అభ్యర్థులను ఎంపిక చేసి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దింపనున్నట్టు సమాచారం. ఇది చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పార్టీ పుట్టినట్టు తెలుస్తున్నది.

నవరంగ్ పార్టీ అధ్యక్షుడిగా షేక్ జలీల్ ఉన్నారు. జనసేన ఓటమే ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఈ పార్టీ ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తమ పార్టీలో బరిలో దిగవద్దని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత శుక్రవారం బెదిరించినట్టు ఆరోపించింది.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?