Etela Rajender: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉద్యమకారుల పాదయాత్ర పోస్టర్ ఎంపీ ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. ఉద్యమకారుల పాదయాత్రను ఊరూర స్వాగతం పలకండి అనే పోస్టర్ ను ఆవిష్కరించారు. మే 15 నుండి ఈ పాదయాత్ర కొత్తగూడెం నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికలముందు అనేక వాగ్దానాలు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం, 250 గజాల జాగా ఇస్తాం, ఉద్యమ సమయంలో కేసులు అయినవారికి పెన్షన్ ఇస్తామని చెప్పి 16 నెలలు అయినా పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఒక్క హామీపై స్పందించకుండా మోసం, దగా చేస్తున్నాడు కాబట్టి ఉద్యమకారులు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వాన్ని మేలుకొలిపి, గుణపాఠం చెప్పాలనీ పాదయాత్ర చేస్తున్నారన్నారు.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో.. సీఎం అత్యవసర సమీక్ష!
వారి డిమాండ్ పరిష్కారం అయ్యేంతవరకు వీరందరికీ నా సంఘీభావం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా మరోసారి ఆత్మావలోకనం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నానని షామీర్ పేట నివాసంలో పాంప్లెట్ ఆవిష్కరణలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజందర్ అన్నారు.