Operation Sindoor (imagecredit:twitter)
తెలంగాణ

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో.. సీఎం అత్యవసర సమీక్ష!

Operation Sindoor: దేశంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్కకు సీఎం రేవంత్ ఫోన్ చేసి తక్షణమే బయలుదేరి హైదరాబాద్ రావాల్సిందిగా ఆయనను సూచించారు.

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూత్మక ప్రాంతంగా ఉన్నందున, డిఫెన్స్ విభాగాలకు స్థావరంగా ఉన్నందున తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అన్నీ విభాగాలకు అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ రోజు సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షించనున్నారు.

Also Read: Solar Pump Sets: పునరుత్పాదక ఇంధన రంగం బలోపేతం.. కేంద్ర మంత్రి తో.. భట్టి విక్రమార్క భేటీ!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సేనలు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన కచ్చితమైన దాడులలో సుమారు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో కొట్లీ, బహవల్పూర్, ముజఫరాబాద్, మురిద్కే, అహ్మద్‌పూర్ ఈస్ట్ సహా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత దాడులు జరిపినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ దాడులు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్టు సమాచారం.
Also Read: Mock Drills: కేంద్రం హైఅలర్ట్.. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. ఏం చేస్తారంటే?

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!