Kavitha meets KCR: గులాబీ అధినేత కేసీఆర్(KCR) తో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఫాం హౌజ్ లో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చజరుగుతుంది. అసలు ఎందుకు కలిసింది.. తాజా రాజకీయాలపై ఏమైనా చర్చించారా? కేవలం కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం కోసమే వెళ్లిందా? ఇంకా ఏమైనా మాటామంతి నిర్వహించారా? అనేది చర్చజరుగుతుంది. కవిత తిరిగి హైదరాబాద్(Hydrabad) కు వచ్చిన ఆ వెంటనే హరీష్ రావు(Harish Rao) భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చజరుగుతుంది.
ఆర్యకు ఆశీర్వాదం ఇచ్చారా
ఎమ్మెల్సీ కవిత చిన్నకుమారుడు ఆర్య గ్రాడ్యూయేషన్ విద్యకోసం అమెరికాకు వెళ్తున్నాడు. ఈ తరుణంలో కాలేజీలో చేర్పించేందుకు కవిత(Kavitha) సైతం వెళ్తున్నారు. ఈ తరుణంలో తాత ఆశీర్వాదంకోసం కవిత తనకుమారుడు ఆర్యతో కలిసి శుక్రవారం ఎర్రవెల్లికి వెళ్లారు. సుమారు గంటకు పైగా కవిత అక్కడే ఉన్నారు. కేసీఆర్(KCR) ఆర్యకు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంలో ఏం మాట్లాడారు.. తాజా రాజకీయాలు చర్చకు వచ్చాయా? ఈ మధ్యకాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రాఖీ పౌర్ణమిన కేటీఆర్(KTR) అందుబాటులో లేకపోవడం తదితర అంశాలను ఏమైనా చర్చించారా? అనేది చర్చఊపందుకుంది. కేవలం ఆశీర్వాదం మాత్రమే కేసీఆర్ ఇచ్చి పంపారా? అనేది కూడా పార్టీలోనూ జోరుగా చర్చజరుగుతుంది.
పార్టీలోని లొసుగులా
కవిత ఎప్పుడైనా తన తండ్రికి పార్టీలో జరుగుతున్న పరిణామాలను లేఖ రూపంలో అందజేస్తుంది. ఈ భేటీ సందర్భంగా కవిత పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు.. నేతల వైఖరీ, చేస్తున్న ప్రకటనలు, మీడియా ముందు మాట్లాడుతున్న వ్యాఖ్యలు తనను ఇబ్బందికి గురిచేస్తున్న అంశాలపై ఏమైనా లేఖను కవిత ఇచ్చారా? అనేది హాట్ టాపిక్ అయింది. కవిత లెటర్ ఇచ్చే సమయంలో ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా ఆమె లేటర్ ఇచ్చారా? లేదా? అనేది కూడా ఎవరికి తెలియదు. ఇప్పటికే వరంగల్ సభపై కవిత ఇచ్చిన లేఖ బయటకు రావడం, పార్టీని ఓ కుదుపు కుదిపింది. పార్టీలోని లొసుగులను ఎత్తిచూపింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఏమైనా ఆ లోఖలో చేసిందా? అనేది కూడా చర్చకుదారితీసింది.
Also Read: People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతపై ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఫైర్
పార్టీ బలోపేతంపై చర్చించారా?
ఎర్రవెల్లి నుంచి కవిత బయటకు రాగానే కేసీఆర్(KCR) తో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao), మాజీ ఎంపీ వినోద్ కుమార్(Vinodh Kumar) తో పాటు పలువురు నేతలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అత్యవసరంగా భేటీ అయ్యారు.. కావల్సిన అవసరం ఏమోచ్చింది.. కవితపై ఏమైనా ఫిర్యాదు చేశారా? లేకుంటే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కాళేశ్వరం9Kaleshwaram), బనకచర్ల ప్రాజెక్టు లపై అనుసరించాల్సిన అంశాలపై, పార్టీ బలోపేతంపై చర్చించారా? అనేది కూడా చర్చజరుగుతుంది. ఇంతకు ఏం మాట్లాడారు అనేది రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చజరుగుతుంది. ఇప్పటికే కవిత పార్టీ నేతలపై పరోక్షంగా, ఎవరి పేరు ఎత్తకుండానే విమర్శలకు ఎక్కుపెట్టింది.
కొంతకాలంగా గులాబీ పార్టీలో
సందర్భం వచ్చినప్పుడల్లా నేతల తీరును అధికారపార్టీకంటే ఘాటుగా విమర్శలు చేస్తుంది. దీంతో సొంతపార్టీలోనే విపక్షం అనే చర్చజరుగుతుంది. మరోవైపు కవిత జాగృతి కమిటీలతో ముందుకెళ్తుండటం, సంస్థను బలోపేతం చేస్తుండటంతో పార్టీకి సైతం గడిపడుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇది పార్టీ గెలుపునకు మైనస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ తరుణంలో హరీష్ రావుతో పాటు నేతలు భేటీ కావడం ఏమై ఉంటుందనేది చర్చజోరందుకుంది. ఏది ఏమైనా గత కొంతకాలంగా గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది.. ఎవరు ఎవరిపై విమర్శలు చేస్తున్నారో తెలియక పార్టీ కేడర్ కన్ ఫ్యూజ్ లో ఉన్నారు. ఇప్పుడు ఒకే రోజు కేసీఆర్ తో కవిత భేటీ కావడం, ఆ వెంటనే హరీష్ రావు భేటీ ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు రాజకీయ వర్గాల్లో విస్తృత జరుగుతుంది.
Also Read: Khammam Police Station: మద్యం మత్తులో రోడ్డుకు అడ్డంగా పడుకున్న వ్యక్తి.. 11 మందిపై కేసు నమోదు