MLC Kavitha (imagecredit:swetcha)
Politics

MLC Kavitha: నల్లగొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: లిల్లిపుట్ లీడర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక లిల్లిఫుట్ నాయకుడు నల్లగొండ(Nalgonda)లో బీఆర్ఎస్(BRS) పార్టీ ని నాశనం చేశాడని, ఆ లిల్లిఫుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమె ఎవరు అని మాట్లాడుతుండు అంటే ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నదెవరో ప్రజలు ఆలోచించాలన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ నల్లగొండ జిల్లాలో ఒక్క సీటుకూడా రాలేదు.. ఆయన సీటునే చావు తప్పి కండ్లు లొట్టబోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండగా గెలిచిన సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలేదు.

కేసీఆర్(KCR) లేకపోతే నీవు ఎవరు? అదికూడా ఆలోచించుకోవాలి కదా? అని నిలదీశారు. కేసీఆర్(KCR) లేకపోతే టీఆర్ఎస్(TRS) లో ఉన్న ఏ నాయకుడు అయినా ఎవరు ప్రజలకు మనందరిని పరిచయం చేసింది కేసీఆరే కదా? అని ప్రశ్నించారు. మనలోమనం కప్యూజ్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లిఫుట్ నాయకుడు మాట్లాడగానే నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చినోళ్లు కూడా ఎటుపడితే అటు మాట్లాడుతుండు అసలు ఎవరు మీకు తెలంగాణ(Telangana) ఉద్యమంతో సంబంధం ఏమిటి? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలియని విషయాల్లో తలదూర్చకు
బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నామీదనే మాట్లాడుతారా? మేము ఉద్యమం చేసిందే మీమీద కదా? చిన్నపిల్లగాడివి చిన్నపిల్లగాడివి మాదిరిగానే ఉండు బాబు పెద్దవాళ్ల విషయాల్లో తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు నీ వెనుకాల చాలా మంది ఉన్నారని అనుకుంటున్నావేమో వాళ్ల సంగతి కూడా వస్తది. ప్రజలకు తెలుస్తది ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయన్నారు. ఒక ఆవేదనతో చెబుతున్నా.. రాజకీయం చేయోచ్చుగానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడపడుచుమీద మీరే అనిపిచ్చి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ(Telangana) ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు. లిల్లిఫుట్ నాయకుడిపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు. లిల్లిఫుట్ నాయకుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిదన్నారు.

Also Read: Nagarjuna Sagar: నాగార్జునసాగర్ తెలంగాణకు అప్పగిస్తూ కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు

బీఆర్ఎస్ పెద్దనాయకుడి హస్తం ఉంది
తీన్మార్ అనుచితమైన వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నాపై చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్టుగా రియాక్టు అయ్యారు. ఏమైందో ఏమోగానీ బీఆర్ఎస్(BRS) సోదరులు రియాక్టు కాలేదు. ఎందుకు కాలేదనేది ఆలోచించాలన్నారు. నేను ఎప్పుడు నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నిర్దిష్టమైన సమాచారంతో చెబుతున్నా ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్(BRS) పెద్దనాయకుడి హస్తం ఉంది అందుకే తిన్మార్ మల్లన్న(Mallana) వ్యాఖ్యలపై రియాక్టు రాలేదు అనేది బలంగా నమ్ముతున్నానన్నారు. ‘కుట్రలు చేసిన పెద్దనాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో పది మందిని పెట్టి నాదగ్గర జరిగే సమాచారాన్ని ఎప్పకటిప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు.

కానీ బాగా పెద్దగా ఉన్న ఆ నాయకుడికి అర్ధం కావాల్సింది ఏమిటంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు. నామీద వ్యాఖ్యలు చేయడానికి ఎవరి ప్రోత్సహించారు. మీరు ఎంత కింది స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేయించారు. అన్ని చూస్తున్న గమనిస్తున్న నేను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతున్న ఇవాళ నన్ను ఒంటరిని చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు నాపై ఇటువంటి వ్యాఖ్యలు చేయించి శునకానందం పొందొచ్చు టెంపరరీగా దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా మీకు తిరిగి కొట్టే సమయం వస్తది’ అని హెచ్చరించారు.

ఉత్తరాన్ని బహిర్గం చేసింది ఎవరో నాకు తెలుసు
‘కేసీఆర్(KCR) నాకు తండ్రి వారికి అంతరంగికంగా రాసిన ఉత్తరాన్ని బయట పెట్టి పార్టీలో జరుగుతున్న అంతరాన్ని బహిర్గం చేసింది ఎవరు ఇవాళా ఆ అంశాలన్ని బహిర్గతం చేసి నన్ను మాట్లాడటానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్లీ దాని చుట్టూ డ్రామాలు ఆడుతున్నవారు ఎవరు ప్రజలకు కూడా తెలుస్తది తప్పకుండా కానీ బీఆర్ఎస్(BRS) కు సంబంధం లేని వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతం ఇచ్చి ఆ వ్యాఖ్యలు చేయించారనడానికి నా వద్దవందలాది ఆధారాలు ఉన్నాయని ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బయటపెడతానని’ వెల్లడించారు. నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా ఓ వ్యక్తి మాట్లాడటంతో వారు సైతం ఆగ్రహంతో ఉన్నారని, వారు సైతం దీక్షలో పాల్గొంటున్నారన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేది వారన్నారు.

మేం తెలంగాణ(Telangana) కోసం కొట్లాడిన వాళ్లం మా పై కొందరు కొత్తగా వచ్చిన వాళ్లు మాట్లాడటం విడ్డురంగా ఉందని, బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చి పదవులు అనుభవిస్తున్నారని, ఇలాంటివారికి అవకాశం ఇవ్వడంతో తెలంగాణ ఉద్యమకారులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Guest Lecturers: 6 నెలలుగా వేతనాలు పెండింగ్.. ఆర్థికశాఖ కొర్రీలు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?