Dasoju Sravan: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Shravan) మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై 10వ షెడ్యూల్ ను సవరిస్తామని చెప్పిన కాంగ్రెస్(Congress) తెలంగాణలో ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయక తప్పదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని చూసుకుని 8 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చిల్లర రాజకీయ వంటకాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.
Also Read: BRS vs Kavitha: గులాబీకి రాజకీయ ప్రత్యర్థిగా ఇక జాగృతి.. కవిత టార్గెట్‌గా బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం
రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్..
రాహుల్ గాంధీ(Rahulgandhi) రాజ్యాంగ సంరక్షకుడినని చెప్పుకుంటూ దేశం మొత్తం తిరుగుతున్నారని, తెలంగాణ(Telangana) లో మాత్రం రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతోందన్నారు. చిల్లర డ్రామా నడిపిస్తున్నారని, రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నిలదీశారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాపాడుతామని కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, కోర్టులు,రాజ్యాంగం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకం లేదన్నారు. రీజనబుల్ టైమ్ అంటే ఎప్పటి వరకు ఉంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధర్మాత్ముడు, మంచి వ్యక్తి అన్నారు. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించండి.. ఒక్క స్థానంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదన్నారు.
Also Read: Makutam: దర్శకుడిగా హీరో విశాల్ మొదటి చిత్రం.. యాక్షన్ కోసం 800 మంది..
