Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలో టైటిల్స్ మార్చేసి, ప్రభుత్వ భూములను ధారదత్తం చేశారని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకించడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదన్నారు. 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం లీజ్ ల్యాండ్‌ను ఫ్రీ హోల్డ్ చేస్తే బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇది బీజేపీ, బీఆర్ఎస్ కలసి ఆడుతున్న నాటకం అని వివరించారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగి పాఠశాలలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దనేది తమ ప్రయత్నంగా పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కన్జర్వేషన్ చేసింది
ఢిల్లీ కాలుష్య పరిస్థితి హైదరాబాద్‌లో రావాలని బీజేపీ, బీఆర్ఎస్ కోరుకుంటున్నాయన్నారు. హిల్ట్ పాలసీ జీవో సొంత భూములపై కన్జర్వేషన్ ఫీజు విధించామన్నారు. నిరుపయోగంగా ఉన్న పరిశ్రమల భూములను ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సిరీస్ అనే ఫార్మా కంపెనీకి సంబంధించిన వంద ఎకరాల ల్యాండ్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం కన్జర్వేషన్ చేసిందని, అప్పుడు నిబంధనలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు.
గ్రిడ్ పాలసీలో 30 శాతం
బీఆర్ఎస్ తెచ్చిన గ్రిడ్ పాలసీలో 30 శాతం ఎస్‌ఆర్‌వో పెడితే పరిశ్రమలు ముందుకు రాలేదన్నారు. తమ ప్రభుత్వం తెచ్చిన పాలసీపై నాచారం ఇండస్ట్రియల్ అసోసియేషన్ మద్దతు తెలిపిందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే ఎకరం భూమిని ప్రభుత్వం ఇండస్ట్రీలకు ఇస్తున్నదని వివరించారు. ఇక, ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, హరీశ్ రావు రూల్స్ తెలిసే విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
Also Read: Minister Sridhar Babu: మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

