Ponnam Prabhakar: బలి తీసుకున్న వాడే మొసలి కన్నీరు కార్చినట్లు బీఆర్ఎస్ (BRS) వ్యవహరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ గతంలో ఆర్టీసీలో నిరసనలు, కన్నీళ్లు, అరెస్టులు వంటివి జరిగేవన్నారు. కానీ తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందన్నారు. పదేళ్ల పాటు ఆర్టీసీని అస్తవ్యస్తం చేశారన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో నే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 250 కోట్ల సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు.
Also Read: Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కొత్త రూల్స్.. రాజకీయ పార్టీలకు ఈసీ కీలక సూచనలు
ఆర్టీసీని నష్టాల నుండి లాభాల్లోకి
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే విధంగా సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ఆర్టీసీని నష్టాల నుండి లాభాల్లోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రయాణికుల సౌకర్యం ,సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం మూడు ఎజెండా తో ముందుకు పోతున్నామన్నారు. కానీ ఛలో బస్ భవన్ అంటూ బీఆర్ఎస్ నేతలు హడావిడి చేయడం హాస్యాస్పదం అన్నారు. గత ప్రభుత్వమే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూశారన్నారు.
మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ గాడిన పడుతుంది
ఇక ప్రయాణికుల సౌకర్యానికి, నగరంలో కాలుష్యం తగ్గించడానికి హైదరాబాద్ లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నామన్నారు. ఆర్టీసీ ఛార్జింగ్ స్టేషన్లు ,హై టెన్షన్ లైన్ తీసుకురావడానికి ఛార్జీల సవరణ చేశామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ గాడిన పడుతుందన్నారు. ఉద్యో గులకు పీఆర్సీ, బాండ్స్, పీఎఫ్, సీసీఎస్ బకాయిలు చెల్లిస్తున్నామన్నారు. ఈ కార్య క్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు ఉన్నారు.
Also Read: Warangal Collector: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
