Mahesh Kumar Goud: బీసీలంతా ఏకం కారనే అభిప్రాయం బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) నేతల్లో ఉన్నదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahsh Kumar Goud) క్లారిటీ ఇచ్చారు. ఆయన హైదరాబాద్ లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఐక్యంగా ఉంటేనే రిజర్వేషన్లు సాధించడం ఈజీ అని వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్(Naveem yadav) విజయానికి దోహదపడాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇక రాహుల్ గాంధీ సందేశం దేశంలో ఉద్యమంగా మారిందన్నారు.
యావత్ దేశం గమనిస్తోంది
రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆకాంక్ష మేరకు ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారో వారికంతా రిజర్వేషన్లను ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. ఇదే నినాదం దేశ వ్యాప్తంగా ఉద్యమంగా మారిందన్నారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తీరును యావత్ దేశం గమనిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు నాయకత్వ అవకాశాన్ని కల్పించిందన్నారు. బీఆర్ఎస్(BRS) లో బీసీ బిడ్డలను రాష్ట్ర అధ్యక్షులుగా చేయగలరా? అని ప్రశ్నించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బీసీ బిడ్డ హనుమంతు రావు(Hanumantha Rao)ను పీసీసీ అవకాశం కల్పించారన్నారు. బీసీ బిడ్డలను రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. త్వరలో రిజర్వేషన్లు అమలు పక్కగా జరుగుతుందన్నారు.
అసత్య ప్రచారం తగదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సందర్భంగా సర్వేల పేరిట అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్(MLCs Addanki Dayakar), బల్మూరి వెంకట్(Balmuri Venkat) లు మండిపడ్డారు. తాజాగా ఓటర్లను ప్రభావితం చేసేలా కేకే సంస్థ తన సర్వే అంచనాలను బయట పెట్టిందని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. కేకే సంస్థ తో పాటు మరి కొన్ని సంస్థల సర్వేలపై ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. హరీష్(Harish), కేటీఆర్(KTR) కనుసన్నల్లో కేకే సర్వే జరిగిందన్నారు. ఇంట్లో కూర్చోని తయారుచేసిన రిపోర్టును పబ్లిక్ లోకి వదిలారన్నారు. గతంలో హర్యానా(Haryana), ఢిల్లీ(Delhi)లో నూ కేకే సర్వే తప్పుడు రిపోర్టులు ఇచ్చిందన్నారు. ఓటర్లకు తప్పుడు సంకేతాలు ఇచ్చే ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. దీంతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కూడా మెయిల్ రూపంలో కంప్లైంట్ ఇస్తామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. కాంగ్రెస్ తప్పక గెలుస్తుందని వెల్లడించారు.
Also Read: Telangana Congress: జూబ్లీహిల్స్‌లో కీలక అస్త్రాలు.. సీఎం ప్రచారంతో కాంగ్రెస్‌లో జోష్
