Kishan Reddy: ప్రధాని మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీల మీటింగ్ లీక్ చేయడం మంచి పద్ధతి కాదని, లీక్ చేసినోడు మెంటలోడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రధానితో మీటింగ్ వివరాలు ఎవరైనా బయట పెడతారా అంటూ ప్రశ్నించారు. లీక్ చేసిన వారెవరో తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని మోడీ ఐకమత్యంతో పనిచేయాలని సూచించారని తెలిపారు.
అంతర్గత విషయాలు లీక్ చేయడం మంచిది కాదు
సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండాలన్నారని, ప్రధానితో సమావేశం మర్యాదపూర్వక భేటీగా చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లు తమను కూడా పిలిచారన్నారు. పార్టీని బలోపేతం చేయమని చెప్పారన్నారని వివరించారు. కానీ అంతర్గత విషయాలు లీక్ చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. ఓట్ చోరీ సభలో ప్రధానమంత్రిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరికావని కేంద్ర మంత్రి విమర్శించారు. అనైతికంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రధాని స్థాయిని తగ్గించేలా రాహుల్ మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. రాహుల్ లాంటి నాయకుడు లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని చురకలంటించారు.
Also Read: Kishan Reddy: మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

