KTR: నేను మళ్ళీ చెప్తున్నా, ఫార్ములా-ఈ కారు కేసు ఒక లొట్టపీసు కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)అన్నారు. నందినగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్ములా-ఈ కారు కేసు(Formula-E Case)లో తాను ఇక్కడే ఉంటానని, ఎవరైనా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్‌కి ఫార్ములా-ఈ రేసు తీసుకురావడానికి తాను అన్ని ప్రయత్నాలు చేశానని చెప్పారు. ఈ రేసు కోసం ప్రభుత్వం నుంచి రూ.46కోట్లు ఇవ్వాలని తానే ఆదేశాలు ఇచ్చానని, ఆ డబ్బులు నేరుగా నిర్దేశిత ఖాతాలోకి చేరాయని తెలిపారు. ఇందులో రూపాయి కూడా ఎక్కడా తారుమారు కాలేదని, ప్రతి రూపాయికి లెక్క ఉందని, అలాంటప్పుడు అవినీతి ఎక్కడిదని ప్రశ్నించారు.
Also Read: Agriculture Officer: మహబూబాబాద్ ఏవో నిర్లక్ష్యమే.. రైతులకు యూరియా కష్టాలు!
ప్రాసిక్యూషన్ చేసినా, ఛార్జిషీట్లు వేసినా ఏమీ చేయలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపై పోరాడుతామని పునరుద్ఘాటించారు. ‘సీఎం, నేను ఇద్దరం కలిసి లై డిటెక్టర్ పరీక్షను టీవీ ఛానల్ ముందు ఎదుర్కొందాం, అని సవాలు విసిరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసల గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారన్నారు. ఈ పరీక్షతో ఎవరు ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం ఫార్ములా-ఈ కేసు(Formula-E Case)ను ముందుకు తెచ్చిందని ఆరోపించారు. కానీ తాము మాత్రం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
హైకోర్టులో కేటీఆర కు ఊరట
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) కు హైకోర్టులో ఊరట లభించింది. నల్గొండ జిల్లాలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఆయనపై నమోదైన మూడు కేసులను కొట్టి వేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీపై కేటీఆర్ ఎక్స్ ఖాతాలో కొన్ని ట్వీట్లు చేశారు. వీటిలో కొందరు కాంగ్రెస్ నాయకుల పేర్లను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొందరు ఎలాంటి ఆధారాలు లేకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లను ప్రస్తావించారంటూ వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. వీటి ఆధారంగా పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టి వేయాలంటూ కొన్ని రోజుల క్రితం కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం వాటిని కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది.
Also Read: Group 1 Exams: హైకోర్టు సంచలన తీర్పు.. గ్రూప్-1 ఫలితాలు రద్దు.. మళ్లీ మెుదటి నుంచి!