KTR: రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం
KTR (image CREDit: swetcha reporteR)
Political News

KTR: రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR: బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హెచ్చరించారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి, అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ని ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. తెలంగాణ భవన్ లో పార్టీ బీసీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో సోమవారం భేటీ అయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామన్నారు.

పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలి

తెలంగాణలో ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామన్నారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలో అపోజిషన్ లీడర్‌గా ఉన్న ఆయన వెంటనే ఈ అంశం పైన పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలన్నారు. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ సహకరించకుంటే రాహుల్ గాంధీ ఎందుకు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తరు అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి నిజంగానే బీసీలపైన, 42 శాతం రిజర్వేషన్ల అంశం పైన చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు సైతం ప్రవేశపెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో గళం లేవనెత్తాలన్నారు.

Also Read: KTR: కాంగ్రెస్ తెచ్చిన రూ. 2.23 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి? బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

20వేల కోట్ల నిధులను కేటాయించేలా కాంగ్రెస్ పై ఒత్తిడి 

బీజేపీ పదేపదే బీసీల మాట చెబుతుంది కానీ వారికి రిజర్వేషన్ల నుంచి మొదలుకొని నిధుల అమలు దాకా, ఓబీసీ సంక్షేమ శాఖ వరకు అన్ని అంశాల్లో ద్రోహం చేస్తున్నదని, బీజేపీ చేస్తున్న మోసాన్ని సైతం ప్రజలు గమనిస్తున్నారన్నారు. విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టులలో 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పక్కన పెట్టిందన్నారు. బీసీలకు బడ్జెట్‌లో ఏటా ₹20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. వచ్చే బడ్జెట్‌లో 20వేల కోట్ల నిధులను కేటాయించేలా కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసాన్ని గ్రామ స్థాయి వరకు వివిధ రూపాల్లో తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్ వెంటే బీసీలు

రాష్ట్రంలోని బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవన్నారు. కుల వృత్తులకు సహకారం అందించడం నుంచి మొదలుకొని విద్యారంగంలో ఏర్పాటుచేసిన విద్యా సంస్థల వరకు బీసీ వర్గాలకు కేసీఆర్ చేసిన మేలును తెలంగాణలోని బీసీలు గుర్తుంచుకున్నారన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న మోసం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు బండ ప్రకాష్, మధుసూదనా చారి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, కర్నె ప్రభాకర్, కిశోర్ గౌడ్, దూదిమెట్ల బలరాజుయాదవ్, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also ReadKTR: సౌదీ మృతుల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్.. సహాయసహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు