KTR ( IMAGE CREDITl: TWITTER)
Politics, లేటెస్ట్ న్యూస్

KTR: ప్రజలకు కాంగ్రెస్ మోసం అర్థమైంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఒకలా ఫలితాలు వస్తే, హైదరాబాద్‌లో మాత్రం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా, అన్నీ సీట్లు బీఆర్‌ఎస్ పార్టీకే ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసిన మోసం రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు ఇంకా బాగా అర్థమైందన్నారు. కొత్త రోడ్లు వేయడం, కొత్త బ్రిడ్జిలు నిర్మించలేదు కదా, ఉన్న రోడ్లను కూడా కనీసం మెయింటైన్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని విమర్శించారు.

Also Read: Vizag Accident: దసరా రోజున కొత్త బైక్.. వారం గడవకముందే యాక్సిడెంట్.. యువకుడు మృత్యువాత

2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం

మీడియా ప్రకటన విడుదల చేశారు. ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. గ్రేటర్ లో లక్షా 20 వేల మంది ఆటో డ్రైవర్లను అడిగితే కాంగ్రెస్ ఏ రకంగా వాళ్ళ కడుపు మీద కొట్టిందో చెప్తారన్నారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ. 2,500, వృద్ధులకు నెలకు రూ. 4,000 పెన్షన్ అన్నారు. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా ఏం మొఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని నిలదీశారు. కాంగ్రెస్ చేసే అన్ని ప్రయత్నాలు విఫలం అవుతాయని, మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

భార్యకి ఫ్రీ బస్సు ఇచ్చి, భర్తకు డబుల్ రేటు

బస్ ఫేర్ హైక్ పెంచడం అనేది మహాలక్ష్మి స్కీమ్‌ని ఆఫ్సెట్ చేసుకోవడం కోసమేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్పే ఇన్నోవేటివ్ థింకింగ్” అంటే .. భార్యకి ఫ్రీ బస్సు ఇచ్చి, భర్తకు డబుల్ రేటు, పిల్లల బస్ పాస్‌ల చార్జీలు పెంచడం అంటే అల్టిమేట్‌గా ఒక్కొక్క కుటుంబం మీద గతం కంటే 20% ఎక్కువ భారం పడడం.. ఇది ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘ప్లస్ పనిలో పని ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈవీ బస్సుల పేరుతో మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారని ఆరోపించారు.

ఎందుకు కార్పొరేషన్ నడపకూడదు?

ఈవీ బస్సులు కార్పొరేషన్ నేరుగా ఎందుకు కొనకూడదు? ఎందుకు కార్పొరేషన్ నడపకూడదు? అని ప్రశ్నించారు. ఈ రకంగా ప్రైవేట్ పరం చేయడానికి ఆర్టీసీని ఒకవైపు, ఇంకోటి మధ్య తరగతి కుటుంబాల జేబులు గుల్ల చేయడానికి హైదరాబాద్‌లోనే చార్జీలు పెంచారన్నారు. పండుగకు ఊరికి పోదామంటే ఒక్కొక్క బస్సు టికెట్ మీద 50 శాతానికి పైగా చార్జీలు పెంచారని విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడు పండగకు బతుకమ్మ చీర వచ్చేది, రంజాన్ తోఫా వచ్చేది, క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. కానీ ఇయ్యాల పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి బస్ చార్జీలు 50 శాతం పెంచి గిఫ్ట్‌లు ఇస్తున్నారు ప్రజలకు అని ఎద్దేవా చేశారు. ముమ్మాటికీ సామాన్య మధ్యతరగతి ప్రజల కోపం ఈ రాబోయే ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని, దాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుందని హెచ్చరించారు.

Also Read: LIC Jeevan Umang Scheme: రూ.1300 పెట్టుబడితో.. లైఫ్ లాంగ్ రూ.40,000 పెన్షన్.. ఎల్ఐసీలో సూపర్ డూపర్ స్కీమ్!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది