KTR: ములుగులో ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మహేశ్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. కార్మికుడు మహేష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేశ్(Mahesh) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న కేటీఆర్ మృతిపై ఆరా తీశారు. ఆదివారం ఆ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. రెడ్‌కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి(Sathish Reddy) కేటీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం మాధవరావుపల్లిలోని మృతుడి ఇంటికి చేరుకొని పరామర్శించారు.
క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ఈ సందర్భంగా కేటీఆర్(KTR) మాట్లాడుతూ 5నెలలుగా జీతాలు అందక ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మహేష్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు. కార్మికులకు కనీసం నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని తెచ్చినందుకు ముఖ్యమంత్రి, మంత్రి సీతక్క(Min Seethakka) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటనకు మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డే(CM Revanth Reddy) పూర్తి బాధ్యతా వహించాలన్నారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి, మంచినీళ్లు అనుకుని పురుగుల మందు తాగి మృతి చెందాడని ఓ వీడియాను సృష్టించి ప్రచారం చేసుకోవడం మరో దుర్మార్గమని, ఇలాంటి చర్యలతో మీ ఘోర వైఫల్యాన్ని, చేతకానితనాన్ని ప్రజాక్షేత్రంలో కప్పిపుచ్చలేరని అధికారపక్షానికి చెందిన నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
Also Read: Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?
న్యాయం జరిగే వరకూ పోరాటం
ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, నెలల తరబడి పెండింగ్ పెడితే పేద కార్మికులు ఎలా బతకాలో సీఎం, మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి వెంటనే రూ.50 లక్షలఎక్స్ గ్రేషియాతోపాటు.. అతడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేకపోతే బీఆర్ఎస్ పక్షాన బాధితుడి కుటుంబంతోపాటు, కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. మహేష్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) తరుపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ తరుపున ముగ్గురు ఆడబిడ్డలను ఆదుకుంటామని, పార్టీ తరుపున పిల్లల పేర్లపై ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. రెండు రోజులో సతీశ్‌రెడ్డితో సాయం అందిస్తారని అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు.
Also Read: BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!