Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మరోమారు కాకరేపుతోంది. ఈ కేసు విచారణలో మరింత దూకుడు పెంచిన సిట్.. వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతలు హరీశ్ రావు, కేటీఆర్ ను విచారించడంతో రాజకీయ అగ్గి రాజుకుంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య ఫోన్ ట్యాపింగ్ కేంద్రంగా మాటల యుద్ధం సాగుతోంది. అయితే శుక్రవారం సిట్ విచారణ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు.. గతంలో నిర్వహించిన ప్రెస్ మీట్స్ లో మాట్లాడిన మాటలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇదే అంశాన్ని అధికార కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తావిస్తూ.. నెట్టింట కేటీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
మాట మారిస్తే ఎలా?
గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు.. సిట్ విచారణకు ముందు చేసిన కామెంట్స్ మధ్య వ్యత్యసం తెలియజేసేలా కాంగ్రెస్ శ్రేణులు ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలోని మెుదటి క్లిప్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘చేస్తే గీస్తే ఒకరు లేదా ఇద్దరు లుచ్చాగాళ్ల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు’ అని అన్నారు. రెండో క్లిప్ లో ‘అంతరాత్మ సాక్షిగా అక్రమ, అనైతిక పనులు.. నేను ఎన్నడూ చేయలేదు. ఇకపై చేయను అని స్పష్టంగా చెబుతున్నా’ అని అన్నారు. ఈ రెండు వీడియోలను పక్క పక్కన పెట్టి.. సిట్ విచారణకు వచ్చేసరికి కేటీఆర్ మాటమార్చారని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.
బయపడ్డాడు… బయపడ్డాడు
విచారణ మొదలవ్వగానే మాట మారిస్తే ఎలా డ్రామారావు?#PhoneTappingCase pic.twitter.com/OVsuCQpHXL
— Telangana Galam (@TelanganaGalam_) January 23, 2026
తప్పు చేశావని నీ మనస్సాక్షికి తెలుసు… ఎందుకీ కవరింగ్ కష్టాలు…#PhoneTappingCase pic.twitter.com/UsQ0DhLJCK
— Aapanna Hastham (@AapannaHastham) January 23, 2026
‘మీ చెల్లినే సాక్ష్యం’
ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేయడం సర్వసాధారణమేనని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సైతం కాంగ్రెస్ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వాలు అస్థిరపడినప్పుడు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని.. వాటితో తమకు సంబంధం ఉండదని కేటీఆర్ అన్న వ్యాఖ్యలకు కవిత మాట్లాడిన మాటలతో కౌంటర్ ఇస్తున్నారు. గత పదేళ్ల పాలనలో తన భర్త పేరు కూడా ఎవరు సరిగా వినలేదని.. అలాంటింది తన భర్త మీద ఆరోపణలు చేస్తున్నారని.. ఆయన ఫోన్ సైతం ట్యాపింగ్ చేశారని గతంలో కవిత మాట్లాడిన వీడియోను కేటీఆర్ కు కౌంటర్ గా కాంగ్రెస్ శ్రేణులు పోస్ట్ చేస్తున్నాయి. ‘సిగ్గుండాలి.. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశారు’ అంటూ కవిత ఘాటుగా వ్యాఖ్యానించడం ఈ వీడియోలో చూడవచ్చు.
నీ చెల్లెనే బలమైన సాక్ష్యాధారం… ఆమె కూడా నీ బాధితురాలే… ఇంకా బుకాయిస్తే ఎట్లా కేటీఆర్? pic.twitter.com/2IMhfVlFGr
— Aapanna Hastham (@AapannaHastham) January 22, 2026
Before SIT After SIT pic.twitter.com/qDL6T4r6xs
— Pulse of Telangana (@pulseoftelangan) January 23, 2026
Also Read: Naini Coal Block: సింగరేణిలో నైనీ టెండర్స్పై ఉత్కంఠ.. హరీశ్ రావు ఆరాటంపై ఆరా తీస్తున్న అధికార పార్టీ..?
పూటకో మాట ఏంటీ సారూ..!
‘లుచ్చాగాళ్ల ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు’, ‘సిట్ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తా’ అంటూ గాంభీర్యాలు పలికినా కేటీఆర్.. ఇప్పుడు పోలీసు బాస్ లను ఇందులో ఇరికించేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. తమ హాయాంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డిని విచారణకు పిలిచారా? అంటూ సిట్ అధికారులను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో ఆయనకు మాకేం తెలుస్తుంది అంటూ ప్లేటు ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. పూటకో మాట మాట్లడంటే ఏంటీ కేటీఆర్ సారూ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

