KTR Meets KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రెండు పిటిషన్ల వేయగా విచారణ చేసిన హైకోర్టు అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో మాజీ మంత్రులు కేటీఆర్,(KTR) హరీష్ రావు(Harish Rao)తో పాటు పలువురు నేతలు సమావేశం అయ్యారు. కోర్టు తీర్పుపై ఏం చేద్దామని చర్చించారు. న్యాయనిపుణులతో చర్చించి కోర్టుకు వెళ్లినా అనుకూలంగా తీర్పు రాలేదని చర్చించినట్లు సమాచారం.
Also Read: Telangana Jobs: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్
ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? వాటిని ఎలా ఎదుర్కొందామని .. ఇలా పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) ఘనతను, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలు, గత యాసంగిలో ప్రాజెక్టులో నీరు లేక రైతులు పడిన ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సన్నద్థం కావాలని హరీష్ రావుకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అదే విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు, యూరియా కొరత, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలపై సైతం చర్చించినట్లు సమాచారం.
ప్రజాసమస్యలపై గళం ఎత్తాలని నేతలకు కేసీఆర్(KCR) దిశానిర్దేశం చేశారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలను, కేడర్ ను సన్నద్ధం చేయాలని కేసీఆర్(KCR) సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలే కలిసి వస్తాయని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ఈ 20 నెలల్లో చేసింది ఏమీలేదని, బీసీ రిజర్వేషన్లపైనా బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఈ అంశాన్ని ఆయా వర్గాలతోనే ప్రచారం చేయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని పేర్కొన్నారు. నేతలకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇవ్వాలని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పకటిప్పుడు ఎండగట్టాలని ఆదేశించారు.
Also Read: Padma Devender Reddy: అన్నదాన కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే ధర్నా.. రైతులను ఆదుకోవాలని డిమాండ్