తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Telangana Jobs: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్

Telangana Jobs:: ఆరోగ్య శాఖలో మరో నోటిఫికేషన్ విడుదలైంది. 1,623 స్పెషలిస్ట్‌ డాక్టర్ పోస్టుల(Doctor posts) భర్తీకి మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌(Hospitals)లో 1,616, ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని హాస్పిటళ్ల(Hospitals)లో స్పెషలిస్ట్ డాక్టర్ల(Doctors)సంఖ్య పెరగనున్నది. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో సేవలు మరింత మెరుగుకానున్నాయి.

Also Read: Education Health Department: వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలు.. అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్​ కుమ్మక్కు?

చరిత్రలోనే విక్టరీ

తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనే క్వాలిటీ వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యు(Telangana Government Doctors) సంఘం అధ్యక్షులు డాక్టర్ నరహరి, జనరల్ సెక్రెటరీ డాక్టర్ లాలూ ప్రసాద్, ట్రెజరరీ డాక్టర్ రవూప్‌లు మాట్లాడుతూ, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ నియామకాల ప్రాసెస్ మొదలైనందుకు సంతోషంగా ఉన్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి,(CM Revanth Reddy)హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha)లకు ధన్యవాదాలు తెలిపారు. ఇది టీవీవీపీ చరిత్రలోనే విక్టరీ అంటూ కొనియాడారు. ఇటీవల మంత్రి హామీ ఇచ్చినట్లుగానే నోటిఫికేషన్ వచ్చిందని, త్వరలో టీవీవీపీ డైరెక్టరేట్ గానూ మారనున్నదన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల ప్రాసెస్‌ను స్పీడ్ చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

పోస్టుల వివరాలు ఇవే..

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో అనస్తీషియా(226), గైనకాలజీ (247), పీడియాట్రిక్స్ (219), జనరల్ మెడిసిన్ (166), జనరల్ సర్జరీ (174), ఆర్థోపెడిక్స్ (89), ఆప్తమాలజీ (38), ఈఎన్‌టీ (54), రేడియాలజీ (71), పాథాలజీ (94), డెర్మటాలజీ (31), సైకియాట్రీ (47), పల్మనరీ మెడిసిన్ (58), ఫోరెన్సిక్ మెడిసిన్ (62), హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (24), బయోకెమిస్ట్రీ (8), మైక్రోబయాలజీ (8) పోస్టులు భర్తీ కానున్నాయి. టీజీఎస్ఆర్టీసీ హాస్పిటల్‌లో అనస్తీషియా, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్, రేడియాలజీలలో ఒక్కో పోస్టును భర్తీ చేయనున్నారు.

 Also Read: Health Department: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎనలేని నిర్లక్ష్యం.. ప్రజలు అంటే బాధ్యత లేని వైనం!

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?