KTR: జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కార్పొరేటర్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిశానిర్దేశం చేశారు. పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో చేయని అభివృద్దిని చేసినట్లు చూపించుకుంటుందని, ప్రజాసమస్యలపై నిలదీయాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. మంగళవారం జరిగే కౌన్సిల్లో ఏయే అంశాలపై గళ మెత్తాలనేదానిపై సూచనలు చేశారు.
Also Read: KTR: రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేసిన తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. జూబ్లీహిల్స్‌లో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఎన్నికల్లో పోరాడిన తీరుపైన అభినందనలు తెలిపారు. పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కి భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు.
29వ తేదీన జరగనున్న దీక్ష దివాస్
కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ నెల 29వ తేదీన జరగనున్న దీక్ష దివాస్‌ను ఘనంగా నిర్వహించాలని కోరారు. అనంతరం దీక్షా దివాస్ సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే కార్యక్రమం సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Also Read: KTR Prosecution Report: కేటీఆర్ ప్రాసిక్యూషన్ రిపోర్ట్.. నమ్మలేని నిజాలను.. బయటపెట్టిన ఏసీబీ!

