KTR ( image credit: swetcha reporter)
Politics

KTR: అవినీతిని తరిమికొట్టాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: హైడ్రా గురించి గొప్పగా చెప్పుతున్న కాంగ్రెస్ కు దమ్ముంటే మంత్రుల అడ్డగోలుగా.. అక్రమంగా కట్టుకున్న నిర్మాణాలను తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హైడ్రాతో ఒక్కరికి కూడా లాభం జరగలేదన్నారు. రేవంత్ రెడ్డి నిజాయితీ లేని మాటలు మాట్లాడుతున్నారని…నేతి బీరకాయలో నెయ్యి అంతా నిజాయితీ ఆయన మాటల్లో ఉంటాయని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ లో శుక్రవారం రోడ్డు షో నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దమ్ముంటే 24 నెలల పరిపాలన చూపించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పుకోరాలని డిమాండ్ చేశారు.

Also Read: KTR: కాంగ్రెస్ నేత‌లు బెదిరిస్తే మాతో చెప్పండి.. వాళ్ల సంగ‌తి చూస్తాం.. కేటీఆర్‌ ఆగ్రహం

ప్రజల్లోని వ్యతిరేకతను దృష్టి

చేసింది ఏమీ లేకపోవడంతోనే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు తన ప్రభుత్వానికి, పరిపాలనకు రెఫరెండం కాదని రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. పరిపాలన పైన నమ్మకం లేకనే ప్రజల్లోని వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండం కాదనిఅన్నారన్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే 24 నెలల పాలన కాలంలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలు చూపించి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.

ప్రజలకు కష్టాలు తప్పడం లేదు 

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో ప్రజలకు కష్టాలు తప్పడం లేదని…సబ్బండ వర్గాలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేశారన్నారు. రెండేళ్ల పాలనలో మోసం చేసిన విద్యార్థులు, యువకులు, రైతన్నలు పారిశ్రామికవేత్తలకు చేసిన మోసాన్ని చూసినందుకు కాంగ్రెస్ కు ఓటు వేయాలా? హైదరాబాదు నగరాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లినందుకు నగర ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో గెలిస్తే అభివృద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాల పై మండి పడ్డారు. గతంలో ఇవే మాటలు చెప్పి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు.

హైడ్రా పేరు అరాచకం 

10ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కు ఓటు వేయాలనికోరారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ నుంచి మొదలుకొని ఆటో డ్రైవర్ల వరకు అందరి ఉపాధి అవకాశాల పైన దెబ్బకొట్టారన్నారు. హైడ్రా పేరు అరాచకం చేశారని, వేలాదిమంది పేదల ఇళ్లు కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద వాళ్ళ ఇంటికి, బస్తీల జోలికి రావదంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ను ఓడిస్తేనే ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు అమలు అవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్టీ రామారావు పేరును ఎత్తే నైతిక అర్హత లేదన్నారు. మంత్రులు అక్రమంగా నిర్మాణం చేసుకున్న ఫామ్ హౌస్లను ఇళ్లను ఎల్ఈడి స్క్రీన్ లపై చూపించారు.

Also Read: KTR: కాంగ్రెస్ నేత‌లు బెదిరిస్తే మాతో చెప్పండి.. వాళ్ల సంగ‌తి చూస్తాం.. కేటీఆర్‌ ఆగ్రహం

Just In

01

DCC Presidents: తుది దశకు చేరిన ఏఐసీసీ కసరత్తు.. ఈ జిల్లాలో డీసీసీ పదవిపై ఉత్కంఠ!

BJP Paid Crowd: వాహ్ మోదీ వాహ్.. పూలు చల్లితే రూ.500, ఏడిస్తే రూ.1000!.. ప్యాకేజీ అదుర్స్ కదూ?

Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’గా ఎవరో తెలుసా? టీజర్ విడుదల

Heart Attack: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్‌ఎస్ నేత

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రూ.1 కోటికి చేరిన బెట్టింగ్‌లు..?