Challenge for Open Debate( image credit: facebook)
Politics

Challenge for Open Debate: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఛాలెంజ్‌లు!

Challenge for Open Debate: రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దామన్న రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.  ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చినా సరే, మీడియా ముందే చర్చిద్దాం. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు చేసేద్దాం అని సవాల్ చేశారు. దీనికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క(Seethakka)   ఇతర మంత్రులు సైతం ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో చర్చిద్దామని ప్రతి సవాల్ చేశారు. ఈ తరుణంలో  ఏం జరుగబోతుంది, అసలు బీఆర్ఎస్ నేతలను సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రానిస్తారా? లేకుంటే పోలీసులు అడ్డుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు ఒక వేళ బీఆర్ఎస్ నాయకులు వస్తే కాంగ్రెస్ (Congress) నుంచి నేతలు వస్తారా? వస్తే ఎవరు వస్తారు అనేది కూడా హాట్ టాపిక్ అయింది.

Also Read: Khajaguda Lands: ఖాజాగూడ భూముల్లో అసలేం జరిగింది?

సవాళ్లతో హీటెక్కిన రాజకీయం

కాంగ్రెస్, (Congress) బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాదు ఎవరు ఏం చేశారో అనేది మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్ సీఎంకు ఇచ్చిన 72 గంటల గడువు మంగళవారం కావడంతో (Somajiguda Press Club) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో చర్చకు సవాల్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరుపై ప్రెస్ క్లబ్‌ను బుక్ చేసినట్లు సమాచారం. అయితే ముందుగా తెలంగాణ భవన్‌కు (KTR) కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులంతా ఉదయం 10 గంటల వరకు చేరుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా ప్రెస్ క్లబ్ వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.

ప్రెస్ క్లబ్‌కు వచ్చి ప్రభుత్వాన్ని నేతలను ఎండగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే భవన్ కు వచ్చిన నేతలను అక్కడే అరెస్టు చేస్తారా, లేకుంటే అంతకు ముందే నేతలను హౌజ్ అరెస్టు చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రెస్ క్లబ్‌కు వస్తే ఏం మాట్లాడుతారు, ఏం సవాల్ చేస్తారనేది కూడా చర్చకు దారి తీసింది. కొంతమంది నేతలు భవన్‌కు కాకుండా నేరుగా ప్రెస్ క్లబ్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

ఢిల్లీలో సీఎం

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీకి రెండు రోజుల పర్యటనకు సోమవారం వెళ్లారు. ఆయన అందుబాటులో లేరు. ఢిల్లీలో కేంద్రమంత్రులను కలుస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నేతలే ముందుగా ప్రెస్ క్లబ్‌కు వచ్చి బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్లలో చేసిన వైఫల్యాలను వివరిస్తారా, లేకుంటే కేవలం విమర్శలతో గడుపుతారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా మంగళవారం బీఆర్ఎస్ చేసిన సవాల్‌పై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది.

Also Read: Sugar: 30 రోజులు చక్కెర మానేస్తే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

Just In

01

Kalvakuntla Kavitha: నేను వాళ్ల, వీళ్ల బాణాన్ని కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని.. కవిత సంచలన కామెంట్స్

Nagarkurnool District: మొంథా తుపాను ఎఫెక్ట్.. శాఖల వారీగా పంట నష్టాలను సేకరించండి

Baahubali re-release: ప్రభాస్‘బాహుబలి ది ఎపిక్’ అక్కడ ఫెయిల్ అయిందా!.. ఎందుకంటే?

Ramya Gopal Kancharla: బిగ్ బాస్ టీమ్ నిండా ముంచేసింది.. దారుణంగా మోసం చేశారు.. రమ్య మోక్ష ఆవేదన

BCCI Cash Reward: వరల్డ్ కప్ గెలిస్తే నజరానాగా రూ.125 కోట్లు!.. ఉమెన్స్ క్రికెట్ టీమ్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న బీసీసీఐ