Konda Vishweshwar Reddy: ఈటల రాజేందర్.. మాజీ సీఎం కేసీఆర్ ను ప్రొటెక్ట్ చేశారనడం వంద శాతం తప్పు అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గులాబీ జెండా అందరిదీ అని చెప్పినందుకే ఈటలను తన్ని వెళ్లగొట్టారని కొండా వ్యాఖ్యానించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అనేది అసాధ్యమైనదని, దీని ద్వారా చేవెళ్ళకు ఒక చుక్క నీరు రాదని ఆయన పేర్కొన్నారు.
Also Read: Kishan Reddy: కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరగాలి.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!
కాళేశ్వరం డిజైన్ పూర్తిగా కేసీఆర్ దే
కాంగ్రెస్ కేవలం మాయమాటలు చెబుతోందన్నారు. కేసీఆర్ రద్దు చేస్తారనుకుంటే.. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం అని పేరు మార్చారన్నారు. కాళేశ్వరం డిజైన్ పూర్తిగా కేసీఆర్ దేనని, ఆ సమయంలో ఆయన ఎన్నో మాటలు చెప్పారని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ చర్చలో హరీశ్ రావు గానీ ఈటల కానీ లేరని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ఇంజనీర్లది తప్పన్నారు. కేసీఆర్ తానా అంటే తందాన అనే ఇంజనీర్లు ఉన్నారని కొండా వ్యాఖ్యానించారు.
ఈటల పాత్ర జీరో
కాళేశ్వరం ప్రాజెక్టులో ఈటలది పాత్ర ఏమాత్రం లేదన్నారు. ఇంత పెద్ద అవినీతి జరిగినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. విచారణ సమయంలో ఈటల ఏం చెప్పారో తెలియదని, కానీ ఇందులో ఆయన పాత్ర జీరో అని తెలిపారు. తాను ఈటలకు సపోర్టు చేసేందుకు రాలేదని, నిజాలు చెప్పేందుకు వచ్చినట్లు కొండా స్పష్టంచేశారు.
Also Read: Deputy CM Bhatti Vikramarka: 2030 నాటికి 20 వేల మెగావాట్ల.. గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం!