Kishan Reddy (imagecredit:swetcha)
Politics

Kishan Reddy: రాజకీయాల్లో మేం శత్రువులం కాదు.. ప్రత్యర్థులమే: కిషన్ రెడ్డి

Kishan Reddy: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదని, అనేక రకాల తప్పులు జరిగాయని, దీంతో తాము అధికారానికి దూరమయ్యామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు. బేగంపేటలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. బీహార్ ఎలక్షన్ లో బీజేపీ(BJP)కి మంచి వాతావరణం ఉందని, కాంగ్రెస్(Congress) కు అసలు ఒక ఎజెండా కూడా లేదని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో కాంగ్రెస్ నేతలకే తెలియదని చురకలంటించారు. ఓట్లు లేవని, డబుల్ ఓట్లు ఉన్నాయని ఆయన విమర్శలు చేస్తున్నారని, లేకుంటే ఓట్లు నమోదు చేసుకోవాలని, ఇలా విమర్శలు చేయడమెందుకని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. రెండు ఓట్లు ఉంటే తొలగిస్తారని, అంతేకానీ.. తనకు తాను ఆటం బాంబు పెడుతున్నా అని రాహుల్ ఫీల్ అవుతున్నారంటూ ఎద్దేవాచేశారు. గతం కంటే ఇప్పుడు బీజేపీకి ఇంకా మెజారిటీ పెరుగుతుందని, తమ సీట్ షేరింగ్ పై కూడా ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్(Hyderabad)లో కూడా చాలామందికి రెండు ఓట్లు ఉన్నాయని, వారు ఏదో ఒకచోట మాత్రమే ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఓటు ఉన్నవాళ్లు రాహుల్ అబద్ధాలు మాట్లాడుతున్నారని నవ్వుకుంటారని, ఓటు లేనివారు ఎవరో కూడా కాంగ్రెస్ నేతలకు తెలియదన్నారు. వారిని వెతికి కాంగ్రెస్ ఓట్లు నమోదు చేయిస్తుందా అని ప్రశ్నించారు.

5 ఏండ్లకు పైగా జైలులో

తీవ్రమైన అవినీతి కారణంగా 30 రోజులు జైల్లో ఉంటే అది ప్రధాని అయినా, కేంద్ర మంత్రి అయినా, సీఎం అయినా పదవికి రాజీనామా చేయాల్సిందేనని, అందుకే ఆ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు కిషన్ రెడ్డి(Kishan Reddy) చెప్పారు. జైల్లో ఉండి కూడా రివ్యూ చేస్తారని అంబేద్కర్ కు తెలిసి ఉంటే అప్పుడే రాజ్యాంగంలో ఈ చట్టాన్ని పొందుపరిచేవారని పేర్కొన్నారు. 5 ఏండ్లకు పైగా జైలులో ఉండేలా శిక్ష పడినట్లయితే పార్టీలకతీతంగా ఎవరి పదవి అయినా పోతుందనేది ఈ బిల్లు ఉద్దేశ్యంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు పెడితే ఆ పార్టీని ప్రజలే ఓడిస్తారని, ఈ చట్టంతో తామెందుకు వారిని అనవసరంగా జైల్లో వేసి ప్రభుత్వాలు కూలుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతికి భయపడే వారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తారని పేర్కొన్నారు.

ప్రాజెక్టులో లోపాలు మాత్రమే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇన్ సైడ్ గా తాము అంతా సెట్ చేసుకుంటున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. జూబ్లీహిల్స్ లో తమకు క్యాండిడేట్స్ కు కొదువలేదని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం అంశంపై అధికార దుర్వినియోగం జరిగిందని, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సీఎం తప్పు చేస్తున్నారని అనేక టీవీ డిబేట్లలో పలువురు రిటైర్ ఇంజినీర్లు చెప్పారని ఆయన గుర్తుచేశారు. ప్రాజెక్టులో లోపాలను మాత్రమే డ్యామ్ సేఫ్టీ అధికారులు చెబుతారని, అవినీతి గురించి వారు చెప్పరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విచారణ సీబీఐకి ఇవ్వాలని లేఖ రాసిందని, ఇప్పుడు స్టాండ్ మార్చుకుందని కిషన్ రెడ్డి చురకలంటించారు.

Also Read: Pollution Check Vehicles: పొల్యూషన్ చెకింగ్ వాహన నిర్వాహకుల ఇష్టారాజ్యం.. అక్రమంగా ఫీజుల వసూళ్లు

ఉప ఎన్నికల తర్వాతే క్లోజ్

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS), వైసీపీ(YCP) మద్దతుపై పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్ రెడ్డి తెలిపారు. తాము ఏ పార్టీని ఇప్పటి వరకు అడగలేదన్నారు. తాము అడగకముందే వారు వారి నిర్ణయాన్ని ప్రకటించుకున్నాయని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి బీసీ ఉప రాష్ట్రపతి అవుతున్నారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా గువ్వల బాలరాజు(Guvala Balaraju) పార్టీలో వస్తామంటే చేర్చుకున్నామని, అంతే తప్పా ఫామ్ హౌజ్ ఇష్యూ కారణం కాదని కేంద్రమంత్రి వెల్లడించారు. అయినా ఆ కేసు మునుగోడు ఉప ఎన్నికల తర్వాతే క్లోజ్ అయిందన్నారు. ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి వెళ్లడం సాధారణమని, దానిలో దాచుకోడానికి ఏముందని, అందులో దొంగతనం ఏముందని, చేర్చుకుంటే క్రైమ్ చేసినట్లా అని ప్రశ్నించారు. అయినా ఎవరో ఒకరు పార్టీలో చేరితే ఉన్నపళంగా పార్టీ బలోపేతమవుతుంది అంటే అది సరికాదని, బలోపేతమవ్వడంలో జాయినింగ్స్ ఒక భాగం మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఫాంహౌజ్ కేసులో అప్పటి సీఎం ఆ రికార్డులను జడ్జీలకు పంపారని, అది సీఎం స్థాయికి తగునా అని విమర్శలు చేశారు. తమ పార్టీలోకి రావాలంటే ఎవరైనా రాజీనామా చేసి రావాలని ఆయన స్పష్టంచేశారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకేలా వ్యవహరిస్తున్నాయన్నారు. వైఎస్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ తీరు అలాగే ఉందన్నారు. కాంగ్రెస్.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని బలీ కా బకరాను చేస్తోందంటూ కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు.

రాజకీయాల్లో తామంతా శత్రువులం

మంత్రి తుమ్మల తనకు కాల్ చేసి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అడిగారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఇస్తామని ఒప్పుకున్నంత యూరియాను అందించామని, మంత్రి అడిగిన యూరియాను కూడా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రామగుండం ఫ్యాక్టరీ(Ramagundam Factory) టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిందని, నిపుణులు వచ్చి సరి చేసే పనిలో నిమగ్నమయ్యారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో తామంతా శత్రువులం కాదని, ప్రత్యర్ధులం మాత్రమేనని కిషన్ రెడ్డి తెలిపారు. అందరికీ శత్రువు పాకిస్థాన్ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల భాషపై కిషన్ రెడ్డి(Kishan Reddy) ఘాటు విమర్శలు చేశారు. పేగులు మెడలో వేసుకుంటా.., బట్టలు విప్పి కొడతాం.., కండ్లు పీకి గోటిలాడుతాం అనేది ఏం భాష అని ధ్వజమెత్తారు.

తాను ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ నే చదువుతానని వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు కేంద్రం ఏంచేసిందని ప్రశ్నిస్తున్నారని, 11 ఏండ్లలో తెలంగాణకు ఏం ఇచ్చామనే అంశంపై పూర్తి నివేదిక త్వరలో అందిస్తానన్నారు. తెలంగాణలో రెండోస్థానంలో ఏ పార్టీ ఉందనే అంశంపై పార్లమెంట్ తో పాటు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పార్టీ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై రాంచందర్ రావు చర్చలు జరిపారని, తమ అభిప్రాయాలు తీసుకున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి తమ బంధువని, రాజకీయాల్లో తాము బంధుత్వాన్ని చూడబోమని స్పష్టంచేశారు. అయినా ఎన్డీయే ఓట్లతో తమ అభ్యర్థి గెలుస్తారని, ఈ ఎన్నికలకు సౌత్ ఇండియా ఇన్ చార్జీగా పార్టీ తనను నియమించిందని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.

Also Read: Ram Charan: మాలలో ఉన్నవాళ్లు కేక్ తింటారా? చిరు-రామ్ చరణ్ కేక్ కటింగ్ వీడియోపై కామెంట్స్ వైరల్..

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?