Pollution Check Vehicles (imagecredit:swetcha)
తెలంగాణ

Pollution Check Vehicles: పొల్యూషన్ చెకింగ్ వాహన నిర్వాహకుల ఇష్టారాజ్యం.. అక్రమంగా ఫీజుల వసూళ్లు

Pollution Check Vehicles: రవాణాశాఖకే పొల్యూషన్ చెకింగ్ వాహన నిర్వాహకులు చెకింగ్ చేస్తున్నారు. అధికారులు పనిచేస్తున్నారా? లేదా? అనేది చెక్ చేస్తున్నారు. వారు పొల్యూషన్ చెకింగ్ కోసం నాణ్యమైన పరికరాలు వాడకుండా, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కాకుండా అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా దర్జాగా వాహనాలకు పొల్యూషన్ చెక్(Pollution check) పేరిట తనిఖీ చేసినట్లు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. దీంతో ఫిర్యాదు ఎక్కువ కావడంతో ఆర్టీఏ(RTA) అధికారులు తనిఖీ చేయగా పలువాహనాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు వెలుగులోకి రావడంతో కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. అవి కేంద్ర కార్యాలయంలోని ఎస్టీఏ(స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీ) కార్యాలయంలోనే ఆ వాహనాలను ఉంచారు.

కదల్లేని స్థితిలో వాహనాలు

రాష్ట్రంలో వాహనాల నుంచి వెలువడే పొల్యూషన్(Pollution) కొలిచేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిన పొల్యూషన్ చెకింగ్ వెహికిల్స్ నిర్వాహకులు అవకతవకలకు పాల్పడుతున్నారు. నిర్దేశించిన రుసుము కంటే అధనంగా వసూలు చేయడం, సరైన పరికరాలను వాడకపోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు రవాణాశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగి..నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న పొల్యూషన్ చెకింగ్ వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆ వాహనాలపై కొరడా ఝులిపిస్తున్నారు. గత నెలరోజుల్లో 20కిపైగా వాహనాలపై కేసులు నమోదయ్యాయి. వాహనాలు అప్ డేట్ కాకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వాహనాల పొల్యూషన్ కొలిచే వాహనాలే పొల్యూషన్ వెదజల్లుతున్నాయి.

చాలా వరకు వాహనాలు కదల్లేని స్థితిలో ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో పాటు మెయిన్ రూడ్లపై, గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లో అయితే ప్రధాన రోడ్లలో వెహికిల్ చెకింగ్ వాహనాలు తరచుగా కన్పిస్తంటాయి. కానీ, అందులో పొల్యూషన్ కొలిచే పరికరాలు కాలం చెల్లినవే కావడం విశేషం. పొల్యూషన్ చెకింగ్ వాహనాలు చెక్ చేసిన తర్వాత పొల్యూషన్‌ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వారిచ్చే రీడింగ్ వివరాలపై వాహనదారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కొందరు ఏకంగా రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో గడిచిన నెలరోజుల్లో సుమారు 20కిపైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.

Also Read: Min Komati Reddy: మరో రెండు రోజులు ఎవరు సెలవులకు వెళ్లొద్దు?

రవాణాశాఖ అనుమతులు తీసుకొని

రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య, వాటి నుంచి వెలువడే పొగ కారణంగా గ్రేటర్ పరిధిలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం చాలా ముఖ్యం. రవాణాశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో కోటి 40 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో చాలా వరకు వాహనాలు కాలుష్య నియంత్రణ పరీక్ష చేయించుకోవడంలేదు. దీంతో వాహనాల నుంచి వెలువడుతున్న పొగతో కాలుష్యం వెలువడుతుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న కొన్ని వాహనాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి.

అటువంటి వాహనాలపై చర్యలు తీసుకునేందుకే పొల్యూషన్ తనిఖీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రవాణాశాఖ అనుమతులు తీసుకొని ప్రైవేటు వాహనదారులు పొల్యూషన్ చెకింగ్ చేస్తున్నారు. ఆ పొల్యూషన్ చెకింగ్ వెహికిల్స్ ప్రత్యేక పరికరాలను కలిగి ఉంటాయి. ఇవి వాహనం నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, ఇతర కాలుష్య కారకాలను కొలుస్తాయి. వాహన యజమానులు తమ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ (పీయూసీ) పొందడానికి, ఈ పొల్యూషన్ చెకింగ్ వాహనాల వద్దకు వెళ్లి తనిఖీ చేయించుకోవడం తప్పన

Also Read: AAI Junior Executive Recruitment : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు