KCR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలు దృష్టిసారించాలని బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(kcr) సూచించారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్‌రెడ్డిలతో పాటు మరికొందరు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన ఎత్తుగడలు, వ్యూహాలను వివరించారు. ‘
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల వారీగా సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం చేయాలన్నారు. కేటీఆర్,(KTR) హరీశ్‌తో పాటు జిల్లాల వారీగా కీలక నేతలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి క్యాడర్‌ను సమాయత్తం చేయాలన్నారు. కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 8న కరీంనగర్‌లో నిర్వహించే బీసీ సభ ఏర్పాట్ల బాధ్యతను మాజీ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar)కు అప్పగించారు. కరీంనగర్ సభపై బీసీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్,(Talasani Srinivas Yadav) శ్రీనివాస్‌గౌడ్, బండ ప్రకాశ్‌లు చర్చించాలని గులాబీ బాస్ ఆదేశించారు.
Also Read: Vijay Deverakonda: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అంటుంటే.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది..
ఇలా చేయండి..
బీఆర్‌ఎస్(BRS) విద్యార్థులకు, యువతకు మరింత చేరువ అయ్యేందుకు ప్రణాళికలతో ముందుకు కెళ్లాలని నేతలకు సూచించారు. నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకతపై విద్యార్థులకు వివరించాలని సూచించారు. బీఆర్‌ఎస్(BRS) నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా కేసీఆర్(KCR) చర్చించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన మూడు నెలల్లోగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్దమవుతూనే, మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్(BRS) బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్(BRS) తో పాటు ఇతర పార్టీల పరిస్థితిపై నివేదిక రూపొందించి ఇవ్వాలని సూచించారు. మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలపైనా చర్చించారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారును టీడీపీ, బీజేపీ నడిపిస్తున్నాయనే విషయాన్ని విడమరిచి చెప్పాలని నేతలకు కేసీఆర్(KCR) ఆదేశించారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా బీఆర్ఎస్ (BRS) లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలను వివరించాలని సూచించారు.
ప్రిపేర్ కావాలి!
ఎన్నికల హామీల అమలు, పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనాల్సిన తీరుపైనా నేతలకు కేసీఆర్(KCR) వివరించినట్లు సమాచారం. కాళేశ్వరం, విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లు, విచారణ జరిగిన తీరు తదితరాలపై సుదీర్ఘంగా చర్చించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వాస్తవాలకు ప్రజలకు చేరవేయడంలో విజయం సాధించిందని పేర్కొన్నట్లుగా తెలిసింది. కాళేశ్వరం విచారణ కమిషన్ నివేదికలో ఏయే అంశాలు ఉండవచ్చనే కోణంలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. విచారణ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించే అవకాశముందని, దీనిపైనా సన్నద్ధం కావాలని సూచించారు.
Also Read: Telangana Police Duty Meet 2025: పోలీస్ డ్యూటీ మీట్‌కు సర్వం సిద్ధం: సీపీ సన్ ప్రీత్ సింగ్