KCR Betrayed The BC Leaders For The kcr daughter kavitha
Politics

KCR: కవిత అరెస్టుపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. అంత మాట అనేశారేంటి..?

– మోడీ మాపై కక్ష కట్టారు
– ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయాలనుకున్నాం
– ఆ కక్షతోనే కవితను అరెస్ట్ చేశారు
– తప్పు జరిగినట్టు వంద రూపాయల ఆధారం కూడా లేదు
– 111 మంది ఎమ్మెల్యేలతో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు
– అలాంటిది, ఇప్పుడు కాంగ్రెస్‌ను వదిలిపెడతారా?
– మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCR: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి నెల దాటింది. బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినా దక్కడం లేదు. రిమాండ్ గడువూ పెరిగింది. కానీ, సొంత బిడ్డ అరెస్టయి ఊచలు లెక్కబెడుతున్నా, ఇన్నాళ్లూ మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉండిపోవడంపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ మౌనంతోనే కవిత తప్పును కేసీఆర్ ఒప్పేసుకున్నారని ట్రోలింగ్ జరిగింది. రాజకీయ నాయకులు కూడా కేసీఆర్ సైలెంట్‌గా ఉండడాన్ని తప్పుబట్టారు. అయితే, ఎట్టకేలకు ఈ అంశంపై స్పందించారు కేసీఆర్. బిడ్డ అరెస్టుపై తొలిసారి పెదవి విప్పారు. కవిత అరెస్టును ప్రతీకారం తీర్చుకోవడానికే అరెస్టు చేశారని కామెంట్ చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా లిక్కర్ కేసుపైనా కేసీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కేసు.. ఉత్తిదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చడానికి బీఎస్ సంతోష్ ప్రయత్నించినప్పుడు ఆయనను అరెస్టు చేయాలని అనుకున్నామని కేసీఆర్ వివరించారు. బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయడానికి పోలీసులను కూడా పంపించామని గుర్తు చేశారు. అందుకోసమే మోడీ తనపై కక్ష కట్టారని అన్నారు. ఆ కక్షతోనే ఢిల్లీ లిక్కర్ కేసులో తన బిడ్డ కవితను అరెస్టు చేశారని వివరించారు. బీఎల్ సంతోష్ పై కేసు పెట్టకపోతే కవితను అరెస్టు చేయకపోతుండేనని తెలిపారు. ప్రతీకారంతోనే కవితను అరెస్టు చేయించాడని సంచలన ఆరోపణలు చేశారు. కవిత తప్పు చేసినట్టు రూ. 100 ఆధారం కూడా చూపెట్టలేదని పేర్కొన్నారు.

Also Read: పారదర్శకమా? పాడా? అవినీతి వ్యవస్థనే సృష్టించారు

ఎన్ని సీట్లు గెలుస్తామంటే?

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 సీట్లు గెలుస్తామని కేసీఆర్ అన్నారు. మరో మూడు చోట్ల కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితుల్లో మిల్లర్లు లేరని పేర్కొన్నారు. అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తున్నదని తెలిపారు. సీఎం చెప్పిన మాటనే అధికారులు వినడం లేదని చెప్పారు.

టచ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు

నరేంద్ర మోడీ దుర్మార్గుడని కేసీఆర్ అన్నారు. 111 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కూల్చాలని మోడీ ప్రయత్నించాడని వివరించారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌ను వదిలిపెడతాడా? అంటూ కామెంట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లుతారనే వాదనలను ఆయన సమర్థించలేదు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లకపోవచ్చునని అన్నారు. ఒక వేళ ఆయన బీజేపీలోకి వెళ్లినా.. అందుకు ఎమ్మెల్యేలు సుముఖంగా లేరని చెప్పారు. అంతేకాదు, తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బాంబు పేల్చారు. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్‌లోకి వలసలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ సమావేశానికి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వారిద్దరూ పార్టీ మారే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతుండటం గమనార్హం.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!