Errolla Srinivas: కేసీఆర్ పోరాటం, ఆమరణ దీక్ష ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. దీక్షా దివస్ ను ఓయూలో శనివారం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల మాట్లాడుతూ దీక్ష – దివస్ చరిత్రలో చిరకాలంగా నిలిచిపోతుందని, ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను తెలంగాణ భవిష్యత్తును మార్చిందన్నారు. తెలంగాణ జైత్రయాత్రో కేసీఆర్ ( KCR) శవయాత్రో అని నినదించి 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పిందని, సరికొత్త చరిత్రకు నాంది పలికిందన్నారు.
Also Read: Kota Srinivas Rao: కోట శ్రీనివాసరావు ముక్కు సూటి మనిషి.. ప్రకాష్ రాజ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది
తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందన్నారు. ఉద్యమ కాలంలో కూడా కనిపించని నిరంకుశత్వాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి కారణం కేసీఆర్ చేసిన దీక్ష వల్లే అని గుర్తుపెట్టొకోవాలన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడతూ కేసీఆర్ పోరాట పటిమ ఆదర్శంగా మనమంతా మళ్ళీ కేసీఆర్ సీఎం అయ్యే వరకు కాంగ్రెస్ మోసాలపై పోరాటం చేయాలని, విద్యార్థుల సమస్యలపై కొట్లాడాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నాయకులు విద్యా సాగర్, స్వామి, కడారి స్వామి, తుంగ బాలు, కోతి విజయ్, నవీన్ గౌడ్, కాటం శివ తదితరులు పాల్గొన్నారు.
Also Read: bhadradri kothagudem: ఆదివాసుల బాధలు.. తీర్చేవారే లేరా..?

