Kota Srinivas Rao: తెలుగు సినిమాల్లో విలనిజానికి కొత్త భాష్యం నేర్పిన కోట శ్రీనివాసరావుతో తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు నటుడు ప్రకాష్ రాజ్. ‘బెంగుళూరు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు కోట శ్రీనివాసరావు సినిమాలు చూసే ఇక్కడకు వచ్చాను. ఆయన నటన నాపై చాలా ప్రభావం చూపింది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమకు వచ్చి రెండు మూడు దశాబ్దాలు ఆయనతో కలిసి పనిచేశా.. ఆయనకంటూ ఒక సెటైర్ ఉండేది. ఆయన ఎవర్నీ వదిలిపెట్టరు… ‘అన్నయ్యా ‘అంబేద్కర్’ అనే సినిమా వచ్చింది ఎందుకో జనాలు చూడటం లేదు’ అంటే… ఆయన కటౌట్‌లోని చెయ్యి ఎక్కడికో చూపిస్తుంది జనాలు అంతా అక్కడకు వెళ్లిపోయారని సెటైరికల్‌గా మాట్లాడేవారు. అంటే దానిలో అర్థం మంచి సినిమాలను ప్రజలు ఆదరించడం లేదనే ఆవేదన ఆయనలో ఉండేది. తెలుగు నటులకు అవకాశాలు దొరకడం లేదంటూ నిరంతరం ఆయన ఆవేదన చెందేవారు. కొందరికి అది కుళ్లు అనిపించినా.. అది చాలా నిజం అని నాకు అనిపించేది.’
Also Read – Pawan Kalyan: ‘ఓజీ’ థియేట్రికల్ బిజినెస్… రికార్డులు బద్దలే!
‘ఒక సందర్భంలో ప్రకాష్ రాజ్ పరభాషా నటుడు కదా అని ఎవరో అంటే… కాదండీ ఆయన తెలుగు నేర్చుకుని మనవాడు అయిపోయాడు కదా అన్నారు. ఆయనకు తెలుగు భాషను తప్పుగా పలకడం ఇష్టం ఉండేది కాదు. అందుకే అలా ఉండేవారు. నా మీద కూడా సెటైర్లు వేసేవారు. నాకు అది బాగా నచ్చేది. దానిని నేను తీసుకునేవాడిని కాదు. గతేడాది నేను ఆలి, బ్రహ్మానందం, బ్రహ్మాజీ మేమందరం కలిసి ఉన్నప్పుడు కోట గారిని గుర్తుచేసుకుంటే ఆయన ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. వెంటనే ఆయనకు కాల్ చేసి ఎలా ఉన్నారు, కుదిరితే షూటింగ్ కు రాగలరా అని అడిగాను. వెహికల్ పంపితే ఆయన వచ్చారు. ఆ రోజు మేమంతా సరదాగా గడపాం. తెలుగు జాతి గర్వించ దగ్గ కళాకారుడు కోట శ్రీనివాసరావు’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు. మా ఎలక్షన్ సమయంలో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే.
Also Read – Errolla Srinivas: కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే బూతులే.. ఎర్రోళ్ల శ్రీనివాస్
తెలుగు సినిమా చరిత్రలో నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోట శ్రీనివాసరావు. కామెడీ విలన్‌గా అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కెరీర్ మొదట్లో కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేసేవారు. 1978లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ప్రాణం ఖరీదు’తో సినిమాల్లోకి ఆరంగ్రేటం చేశారు. తర్వాత రోజుల్లో తెలుగుతో పాటు హీందీ తమిళం, కన్నడలో సుమారు 750 కు పైగా చిత్రాల్లో నటించారు. నాలుగు దశాబ్దాల పాటు నడిచిన నటనా జీవితంలో ఆయన తొమ్మిది నంది అవార్డులు అందుకున్నారు. 1999 లో విజయవాడ తూర్పు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన సినిమాలకు అందించిన సేవలకు గాను 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.